'అద్వానీ-సుష్మా ఇద్దరిలో రాష్ట్రపతి ఎవరైనా ఓకె, యూపీలో బీజేపీ గెలుపు ఆశ్చర్యం'

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బీజేపీపై ఎప్పుడూ నిప్పులు చెరిగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతి పదవి విషయంలో మాత్రం ఆ పార్టీకి అనుకూలంగా స్పందించారు. అద్వానీని రాష్ట్రపతి చేయాలన్న బీజేపీ నిర్ణయానికి ఆమె సానుకూల స్పందన తెలియజేశారు. అద్వానిని రాష్ట్రపతిగా నిలబెడితే మద్దతు ఇస్తామని సూచనప్రాయంగా ఆమె అభిప్రాయపడ్డారు.

తాజాగా ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగాల్ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అద్వానీని కాకుండా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లలో ఎవరిని రాష్ట్రపతిగా నిలబెట్టినా మద్దతునిస్తామని అన్నారు. కాగా, జూలై 24న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

I would be happy if LK Advani or Sushma Swaraj become President: Mamata Banerjee

ఇక తాజా యూపీ ఎన్నికల పట్ల మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ దీనిపై ఎన్నికల కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోర్టుకు వెళ్లాలని ఆమె సూచించారు.

2019 సాధారణ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఇక బెంగాల్ స్కామ్ నారద స్టింగ్ ఆపరేషన్ బీజేపీ కుట్ర అని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
West Bengal Chief Minister Mamata Banerjee said that she would be happy if BJP leader Lal Krishna Advani or Sushma Swaraj becomes the President of India.
Please Wait while comments are loading...