వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన ఐఏఎఫ్ మిగ్ 21 యుద్ధ విమానం: ఇద్దరు పైలట్‌లు మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. కాగా, విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ఘటనా స్థలంలోనే మరణించారు.

"ఇది IAF విమానం బైటూలోని భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయింది " అని బార్మర్ జిల్లా కలెక్టర్ లోక్ బందు పీటీఐకి చెప్పారు. రష్యా రూపొందించిన జెట్, MiG-21 అన్ని IAF ఫైటర్ జెట్‌లలో అత్యంత ప్రమాదానికి గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బార్మర్‌లో జరిగిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. ఈ ఘటనపై ఐఏఎఫ్ చీఫ్ ఆయనకు సమగ్రంగా వివరించినట్లు ఏఎన్ఐ నివేదించింది.

2021లో, ఐదు MiG-21 విమానాలు భారతదేశంలో కూలిపోయాయి. ఫలితంగా ముగ్గురు పైలట్లు మరణించారు. గత ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శిక్షణ సమయంలో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించారు.

IAFs MiG-21 Fighter Jet Crashes In Barmer District, Rajasthan: Two Pilots Martyred

ఆగస్టులో, రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఒక గ్రామ సమీపంలో శిక్షణలో ఉన్న మరో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

పంజాబ్‌లోని మోగా సమీపంలో ఆ ఏడాది మేలో జరిగిన ఇలాంటి ఘటనే పైలట్‌ను బలితీసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు IAF విమానం సాధారణ శిక్షణలో ఉంది.

మార్చిలో, మధ్య భారతదేశంలోని ఎయిర్‌బేస్‌లో MiG-21 విమానానికి సంబంధించిన ప్రమాదంలో IAF గ్రూప్ కెప్టెన్ మరణించాడు. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఎ గుప్తా మృతి చెందాడు.

జనవరిలో రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. విమానం పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడగలిగాడు.

English summary
IAF's MiG-21 Fighter Jet Crashes In Barmer District, Rajasthan: Two Pilots Martyred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X