వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో వరద బీభత్సం: వరదలో చిక్కుకున్న 119మంది రైలు ప్రయాణికులను రక్షించిన ఐఏఎఫ్

|
Google Oneindia TeluguNews

అస్సాం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అస్సాం రాష్ట్రంలో పోటెత్తుతున వరదతో ఇప్పటి వరకు 57 వేల మంది నిరాశ్రయులయ్యారు. కొండ చరియలు విరిగిపడి ఇప్పటికే ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగటంతో చాలా ప్రాంతాలలో అంధకారం అలముకుంది. రోడ్లు వరదనీటికి తెగిపోవటంతో రవాణా వ్యవస్థ దెబ్బ తింది. ఇక భారీ వర్షాల కారణంగా సిల్చార్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కాచర్ ప్రాంతంలో నిలిచిపోయింది. వరద నీటి కారణంగా రైలు ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రైలులో ప్రయాణిస్తున్న 119 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది.

భారీ వర్షం కారణంగా రైలు చిక్కుకుపోవడంతో సిల్చార్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని 119 మంది ప్రయాణికులను భారత వైమానిక దళం రక్షించింది. సిల్చార్-గౌహతి రైలు కాచర్ ప్రాంతంలో నిలిచిపోయిన రైలు వరద నీటి కారణంగా ముందుకు లేదా వెనుకకు వెళ్లలేకపోయింది. దీంతో రైలు చాలా గంటలపాటు నిలిచిపోయిన తర్వాత, జిల్లా యంత్రాంగం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో 119 మందిని రక్షించింది. దీంతో ప్రయాణికులు, వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు.

IAF rescues 119 train passengers in Silchar-Guwahati Express stranded in assam floods

ఆకస్మిక వరదలు మరియు అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడటం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి రైలు మరియు రోడ్డు మార్గాలు తెగిపోవడంతో అస్సాం వరద బీభత్సాన్ని చూస్తోంది. న్యూ కుంజుంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయ్, నమ్‌జురాంగ్, సౌత్ బాగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్ మరియు లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడం వల్ల దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) తెలిపింది.

జటింగా-హరంగాజావో మరియు మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ కొండచరియలు విరిగిపడటం వలన మూసివేయబడింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం చేరుకోవడానికి ముందు, కొండచరియలు విరిగిపడటం వలన రహదారిని మూసివేశారు. మొత్తం అస్సాంలోని ఏడు జిల్లాల్లో దాదాపు 57,000 మంది ప్రజలు వరదల బారిన పడి నిరాశ్రయులయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొంది.

English summary
Floods Creates havoc in Assam. The IAF has rescued 119 passengers on the Silchar-Guwahati Express trapped in the floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X