కచ్‌లో కూలిన యుద్ధ విమానం: పైలట్ మృతి
జామ్‌నగర్: భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)కి చెందిన యుద్ధ విమానం ఒకటి గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్ మరణించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
#Gujarat: An aircraft has crashed in Kutch's Mundra, pilot missing. More details awaited. pic.twitter.com/2Q1SPxvMF0
— ANI (@ANI) June 5, 2018
సాధారణ శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన జాగ్వార్ యుద్ధ విమానం కచ్‌లోని ముంద్రా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, జేఏఎఫ్ కమాండర్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయారు.

సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని ధృవీకరించిన ఐఏఎఫ్ అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అసోంలోని మజులీ ద్వీపంలో ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.












Click it and Unblock the Notifications