రూ. 100 కోట్ల స్కాం: సీఐడీ కస్టడీలో ఐఏఎస్ అధికారి
సిలిగురి: పశ్చిమ బెంగాల్ లో ఐఏఎస్ అధికారిని సీఐడీ పోలీసు అధికారులు కస్టడిలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆయనకు కుంభకోణంలో ఎంత ముడుపులు అందాయనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఐఏఎస్ అధికారిని విచారణ చెయ్యడానికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న కిరణ్ కుమార్ సీఐడీ కస్టడిలో ఉన్నారు. సిలిగురి-జల్ పాయ్ అభివృద్ది మండలి (ఎస్ జేడీఏ)లో రూ. వంద కోట్ల స్కాం జరిగిందని వెలుగు చూసింది.

అప్పట్లో కిరణ్ కుమార్ ఎస్ జేడీఏ సీఈవోగా పని చేసేవారు. అదే సమయంలో కుంభకోణం విషయం వెలుగు చూడటంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తరువాత కిరణ్ కుమార్ పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శిగా బదిలి అయ్యారు.
ఈ కేసులో కిరణ్ కుమార్ ప్రధాన నిందితుడు. ఈయనను గురువారం సిలిగురి కోర్టులో హాజరుపరిచారు. తరువాత కిరణ్ కుమార్ ను విచారణ చెయ్యడానికి కస్టడిలోకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టు ముందు మనవి చేశారు. కోర్టు నాలుగు రోజుల పాటు విచారణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది.












Click it and Unblock the Notifications