ఐఏఎస్ డికే. రవి కేసు: హై కోర్టులో అర్జీ కొట్టివేత

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయాలను బహిరంగం చెయ్యారాదని మహిళ ఐఏఎస్ అధికారి భర్త సుధీర్ రెడ్డి వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తులోని ఎలాంటి విషయాలను బహిరంగం చేయబోమని ప్రభుత్వం న్యాయస్థానం ముందు చెప్పింది

మహిళ ఐఏఎస్ అధికారి భర్త సుధీర్ రెడ్డి వేసిన పిటిషన్ (అర్జీ)ను గురువారం హై కోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ విచారణ చేశారు. ఆ సమయంలో డికే రవి కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలను ప్రభుత్వం బహిరంగం చెయ్యదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎ.ఎస్. పోన్నణ్ణ న్యాయమూర్తికి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి డికే రవి కేసు దర్యాప్తును ఇప్పటికే సీబీఐకి అప్పగించిందని న్యాయస్థానం ముందు చెప్పారు. సీఐడి అధికారులు దర్యాప్తు చేసిన నివేదిక, ఆధారాలు మొత్తం సీబీఐకి అప్పగించారని అన్నారు. సీఐడి అధికారులు దర్యాప్తు చేసిన వివరాలు ఎలాంటి పరిస్థితిలో బయటపెట్టమని అన్నారు.

IAS officer D.K. Ravi death case: The Karnataka High Court disposed of a petition,

అంగీకరించిన సుధీర్ రెడ్డి....................!

ప్రభుత్వం కేసు దర్యాప్తు వివరాలను బయటపెట్టమని చెబుతున్న సమయంలో అర్జీ విచారణ చెయ్యడం భావ్యం కాదని హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ అన్నారు. అర్జీ సమర్పించిన సుధీర్ రెడ్డి, ఆయన న్యాయవాది సజ్జన్ పూవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం దర్యాప్తు వివరాలు బయట పెట్టమని చెబుతున్నారని, అర్జి కొట్టి వెయ్యడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

ఐఏఎస్ అధికారి డికే. రవి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన తరువాత సీఐడి అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్న వివరాలను బహిరంగం చేస్తే మహిళ ఐఏఎస్ అధికారికి, తమ కుటుంబానికి జరగరాని నష్టం జరుగుతుందని సుధీర్ రెడ్డి హై కోర్టులో అర్జీ సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+