ఐబీపీఎస్ నుంచి ఉద్యోగాల భర్తీకోసం భారీ నోటిఫికేషన్

బ్యాంకుల్లో పనిచేయాలనుకునేవారికి ఇది నిజంగా శుభవార్తే. బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 4102 పీఓ / మేనేజ్‌మెంట్‌ పోస్టులను భర్తీ చేసేందుకు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల పక్షాన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) ఈ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. ఇటీవలి కాలంలో వెలువడిన అతి భారీ నోటిఫికేషన్‌ ఇదే కావడం గమనార్హం .

అలహాబాద్‌ బ్యాంక్‌లో 784, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 965, కెనరా బ్యాంక్‌లో 1200 కార్పొరేషన్‌ బ్యాంక్‌లో 84, యూసీవో బ్యాంక్‌లో 550, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 519 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూకు వెయిటేజీని 80:20గా నిర్ణయించారు.

IBPS releases notification for filling up of 4102 Probationary Officers

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌లో జరుగుతుంది. మెయిన్‌ పరీక్ష మాత్రం గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగష్టు 14 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 4
దరఖాస్తు రుసం: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.100
పరీక్ష తేదీలు: అక్టోబరు 13, 14, 20, 21 తేదీల్లో ప్రిలిమినరీ, నవంబరు 18న మెయిన్‌ పరీక్ష

మరిన్ని వివరాలకు: http://www.ibps.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+