వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఐఐటీ కరోనా టెస్ట్ విధానానికి ఐఐటీ ఆమోదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తక్కువ ఖర్చులో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన వినూత్న విధానానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కువ మంది వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది.

అంతేగాక, ఇది 'రియల్ టైమ్్ పీసీఆర్ బేస్డ్ డయాగ్నోస్టిక్ ఆసే' విధానం అని పేర్కొంది. కాగా, ఈ ప్రక్రియకు ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన తొలి విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీనే కావడం గమనార్హం. ఫలితాల్లో భారీ వైరుధ్యం వస్తున్న కారణంగా చైనా తయారీ కిట్ల ద్వారా పరీక్షల నిర్వహణను ఐసీఎంఆర్ నిలిపివేసిన విషయం తెలిసిందే.

 ICMR approves IIT Delhis Coronavirus test

తాము రూపొందించిన విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం ఖచ్చితత్వం వచ్చిందని ఐఐటీ వెల్లడించింది. మానవుల్లో ఉండే ఇతర కరోనావైరస్‌లలో లేని కొన్ని ప్రత్యేకతలను కరోనా కారక వైరస్‌లోని ఆర్ఎన్ఏలో గుర్తించినట్లు స్పష్టం చేసింది. వీటిని లక్ష్యంగా చేసుకుని రోగ నిర్ధారణ చేసే విధానాన్ని తాము అభివృద్ధి చేస్తామని తెలిపింది. కాగా, దేశంలో ఎక్కువగా దక్షిణకొరియా అభివృద్ధి చేసిన టెస్టింగ్ కిట్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

English summary
A "detection assay", or test, for COVID-19 developed at Indian Institute of Technology Delhi has been approved by Indian Council for Medical Research. It will be a probe-free assay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X