ఐడియా బంఫర్ ఆఫర్: అన్ని నెట్ వర్క్ లకు ఒకే ధరకు డేటా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకు టెలికం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ కస్టమర్లు ఇతర టెలికం నెట్ వర్క్ ల వైపుకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి.అయితే తాజాగా ఐడియా 2జీ, 3 జీ, 4జీ నెట్ వర్క లకు ఒకే ధరకు డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ఐడియా నెట్క్ వర్క్ తన డేటాను ఒకే ధరకు విక్రయించాలని నిర్ణయించినట్టుగా ప్రకటించింది. ఈ కొత్త విధానం మార్చి నెలాఖరు నుండి అమల్లోకి రానున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

Idea to sell 2G, 3G, 4G mobile data at same price from Mar-end

1జీబీ కంటే ఎక్కువ డేటా ప్లాన్స్ ను 2జీ, 3 జీ, 4 జీ నెట్ వర్క్ లకు ఒకే ధరలో విక్రయించనున్నట్టు ఐడియా ప్రకటించింది.

డేటా ప్లాన్స్ ధరల్లో నెట్ వర్క్ ను బట్టి మార్పు ఉండదని ఐడియా సెల్యూలర్ ప్రకటించింది.ఈ ఏడాది మార్చి 31వ, తేదినుండి ఈ విధానం అమల్లోకి రానున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.

నిజానికి 2జీ, 3జీ, 4 జీ నెట్ వర్క్ లకు వేర్వేరుగా ఐడియా డేటా ప్లానింగ్స్ ధరలు ఉంటాయి. అయితే రిలయన్స్ జియో అందిస్తోన్న 4 జీ మోబైల్ డేటా సర్వీసు ఐడియా 2 జీకి ఇచ్చే ధర కంటే కూడ తక్కువగా ఉంది.దరిమిలా రియలన్స్ నుండి గట్టిపోటీని ఎదుర్కోవాలంటే ఐడియా టారిఫ్ ప్లాన్లలో మార్పులతో పాటు పలు ఆఫర్లను ప్రకటిస్తోంది.ఇందులో భాగంగా కొత్త ఆఫర్ ను మార్చి నెలాఖరు నుండి ప్రారంభించనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telecom operator Idea Cellular will start selling 1GB and above mobile data plans across its 2G, 3G and 4G network at same price by the end of this month.
Please Wait while comments are loading...