Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jammu Kashmir: ఎల్ఓసీ సమీపంలో ఐఈడీ పేలుడు.. ఇద్దరు సైనికులు మృతి

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లోని ఎల్ఓసీ సమీపంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జమ్మూ జిల్లాలోని ఖౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలసోని కేరీ బత్తల్ ప్రాంతంలోని ఎల్వోసీ సమీపంలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడగా.. వారిని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరు చికిత్స సమయంలో మరణించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఉగ్రవాదుల కోసం గాలింపు..
అధికారుల ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ లేఖ దగ్గ ఆర్మీ బృందం గస్తీ కాస్తోంది. ఆ సమయంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఆదనపు ఆర్మీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిని సైనికులను ఆస్పత్రికి తరలించిన తర్వాత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులు అమర్చి ఉంటారని భావిస్తున్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(IED)పేలడం వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక సమాచారం వెల్లడించింది. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దిగ్బంధించబడిందని అధికారులు వెల్లడించారు.

IED Blast Near LOC in Jammu Kashmir Two Soldiers Killed

కాల్పుల్లో సైనికుడికి గాయాలు
ఇదిలా ఉండగా.. సోమవారం రౌజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నౌషెరా సెక్టార్ లోని కలాల్ ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్ట్ లో ఆ జవాన్ కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో ఎల్వోసీ వెంబడి కాల్పులు జరిగాయి. ఫిబ్రవరి 8న కేరీ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి అడవి నుంచి వచ్చిన ఉగ్రవాదు ఆర్మీ పెట్రోలింగ్ చేస్తున్న వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రతీకారంగా భారత దళాలు కూడా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాయి. అనంతరం ఆ ప్రాంతంలో కఠినమైన నిఘాను ఏర్పాటు చేశారు.

ఎల్ఓసీ దగ్గర దొరికిన ఆయుధాలు
కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని కర్నా ప్రాంతంలో సోమవారం జరిగిన సోదాల్లో భద్రతా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. కర్నా తహసీల్ లోని బాడి మొహల్లా అమ్రోహి ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం అందడంతో సైన్యం, పోలీసుల సంయుక్త బృందం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిందని అధికారులు వెల్లడించారు. ఆ సోదాల్లో భద్రతా దళాలు ఒక ఏకే47 రైఫిల్, ఒక ఏకే మ్యాగజైన్, ఒక సైగా ఎంకే రైఫిల్, ఒక సైగా ఎంకే మ్యాగజైన్, 12 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+