బీజేపీ గెలిస్తే.. భారత్‌లోకి పీవోకే ఖాయం: యోగి ఆదిత్యనాథ్

జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) తిరిగి భారతదేశంలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌లో చివరిదైన మూడో దశ ఎన్నికలు జరగనున్న క్రమంలో జమ్మూలోని ఆర్ఎస్ పురలో యోగి ఆదిత్యనాథ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పాకిస్థాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైందని, సంక్షోభంలో కూరుకుపోయింని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ తర్వాత త్వరలోనే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కూడా జమ్మూకాశ్మీర్‌లో కలుస్తుందని అన్నారు. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు.

If BJP wins in Jammu and Kashmir PoK will enter India Yogi Adityanath

కాగా, జమ్మూకాశ్మీర్‌లో అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. 40 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.

జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు జమ్మూకాశ్మీర్‌లో పలుమార్లు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మరోవైపు, కేంద్రమంత్రి అమిత్ షా గురువారం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరిక చేశారు. ఉగ్రవాదులతో శాంతి చర్చలకు సిద్ధమేనని అన్నారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా (Amit Shah) తీవ్రంగా హెచచరించారు.

జమ్మూకాశ్మీర్‌లోని కఠువాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఓటు బ్యాంక్ రాజకీయా కోసం ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చర్చలు జరపాలని అడుగుతున్నాయని.. చర్చలు కావాలనుకుంటే ఆయుధాలు వదిలేసి రావాలని స్పష్టం చేశారు అమిత్ షా. లేదంటే భద్రతా బలగాలు వెంటాడుతాయని తేల్చి చెప్పారు.

మూడు దశాబ్దాలకుపైగా ఉగ్రవాదం కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించి ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఇదంతా బీజేపీతోనే సాధ్యమైందన్నారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందన్నారు అమిత్ షా. ఉగ్రవాదాన్ని పాతాళంలోకి తొక్కిపెట్టేవరకు విశ్రమించబోమని ఆయన తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+