సీఎం పళనిసామి బలపరిక్షలో ఓడిపోతే తమిళనాడులో ఇదే పరిస్థితి !

శశికళ వర్గంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సీఎం ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా ఓటు వేసి ఇన్ని రోజులు మమ్మలి రిసార్ట్ నిర్బంధించారని అసెంబ్లీలో చెబితే సీన్ రివర్స్ అవుతుంది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అసెంబ్లీలో బలపరిక్షలో ఓడిపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఎడప్పాటి పళనిసామి శిభిరంలో 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ వర్గం అంటున్నది.

అన్నాడీఎంకే పార్టీలో ఇప్పటికే దాదాపు 40 మంది శాసన సభ్యులు తిరుగుబాటు చెయ్యడంతో వారిని బుజ్జగించారు. అయితే అసెంబ్లీలో బలపరిక్షలో వారు ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రత్యక్షంగా నిరసన వ్యక్తం చేస్తే సీన్ రివర్స్ అవుతుంది.

If CM Palanisamy faile to prove majority in Assembly !

ఇన్ని రోజులు మమ్మల్ని రిసార్ట్ లో నిర్బంధించారని అందరి ముందు అసెంబ్లీలో చెబితే మొదటికే మోసం వస్తుంది. ఈ సందర్బంలో అసెంబ్లీలో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం వారికి అండగా నిలిచే అవకాశం ఉంది.

ఈ సందర్బంలో డీఎంకే మద్దతుతో పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంది. అయితే తాము ఎవ్వరికీ మద్దతు ఇవ్వమని ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఇప్పటికే డీఎంకే పార్టీ స్పష్టం చేసింది. ఎవ్వరికి పూర్తి మెజారిటీ లేకపోతే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని తమిళ మీడియా కోడైకూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+