2017 శాసన సభ ఎన్నికలు: బీజేపీకి బ్రహ్మరథం

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో 2017లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అని ఇండియా టుడే-యాక్సిస్ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్దం అయ్యారు.

ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా (కేంద్ర పాలిత ప్రాంతం)లో బీజేపీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ మేజారిటీ వస్తుందని తెలిపింది.

సర్జికల్ స్ట్రైక్ దెబ్బ

సర్జికల్ స్ట్రైక్ దెబ్బ

మొత్తం 37,866 మంది ఓటర్ల అభిప్రాయం సేకరించారు. పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చెయ్యడాన్ని మీరు సమర్థిస్తారా అంటే ఉత్రరప్రదేశ్ లో 90 శాతం, పంజాబ్ లో 88 శాతం, ఉత్తరాఖండ్ లో 77 శాతం మంది సర్జికల్ స్ట్రైక్ దాడులను సమర్థించారు.ఉత్రరప్రదేశ్ లో దలితులు, మైనారీల మీద అత్యాచారాలు, దాడులు చెయ్యడంతో ఆ రాష్ట్ర ప్రజలు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మీద విరక్తి పెంచుకున్నారు. యూపీ ప్రజలు బీజేపీకి మొదటి ప్రధాన్యత, తరువాత మాయావతికి మద్దతు ఇస్తున్నారని ఇండియా టుడే సర్వే వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉన్నసామాజ్ వాదీ పార్టీకి ప్రజలు చెక్ పెడుతున్నారు, బీజేపీ 170 నుంచి 183 స్థానాలు, బహుజన సమాజ్ వాదీ పార్టీకి 94 నుంచి 103 సీట్లు, సమాజ్ వాదీ పార్టీకి 94 నుంచి 103 స్థానాలు, కాంగ్రెస్ కు 8 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 6 స్థానాలు వస్తాయని వెలుగు చూసింది.

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్

బీజేపీకి 38 నుంచి 43 స్థానాలు, కాంగ్రెస్ కు 26 నుంచి 31 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 4 స్థానాలు వస్తాయని సర్వేలో వెళ్లడైయ్యింది.

గోవా

గోవా

గోవాలో బీజేపీకి 17 నుంచి 21 స్థానాలు, కాంగ్రెస్ కు 13 నుంచి 16 స్థానాలు, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు 1 నుంచి 3 స్థానాలు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వస్తాయని సర్వే చెప్పింది.

మణిపూర్

మణిపూర్

మణిపూర్ లో బీజేపీకి 31 నుంచి 35 స్థానాలు, కాంగ్రెస్ కు 19 నుంచి 24 స్థానాలు, ఎన్ పీఎఫ్ పార్టీకి 3 నుంచి 5 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 4 స్థానాలు వస్తాయని సర్వే వివరించింది.

పంజాబ్

పంజాబ్

పంజాబ్ లో కాంగ్రెస్ కు 49 నుంచి 55 స్థానాలు, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి 42 నుంచి 46 స్థానాలు, బీజేపీ+ఎస్ఏడీ సంయుక్త కూటమికి 17 నుంచి 21 స్థానాలు, ఇతరులకు 3 నుంచి 7 స్థానాలు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+