• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏం ఎమ్మెల్యేరా బాబూ: అబ్బాయి ప్రేమను తిరస్కరిస్తే అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి జరిపిస్తారట

|

ముంబై: ఒక అమ్మాయిని ప్రేమించి తన ప్రేమను వ్యక్తం చేశాకా... అబ్బాయిని తిరస్కరిస్తే... అలాంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసైనా సరే ఆ అబ్బాయికిచ్చే వివాహం జరుపుతామని గట్‌కోపర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఏదో తమాషాగా చెప్పలేదు.. కదం ఈ వ్యాఖ్యలు చాలా సీరియస్‌గానే చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తాను ఎంత సీరియస్‌గా ఈ వ్యాఖ్యలు చేశాడో చెప్పేందుకు అక్కడి ప్రజలకు తన మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఏ సమయంలోనైనా సరే తనకు ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తామని చెప్పుకొచ్చారు.

" నాకు ఫోన్ చేసి సహాయం కావాలని అడగండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకంటాను కానీ అమ్మాయి నా ప్రేమను తిరస్కరిస్తోందని చెప్పి సహాయం కోసం అడగండి. నేను తప్పకుండా సహాయం చేస్తాను. అదే సమయంలో మీ తల్లిదండ్రులను కూడా పిలిపించాలి. అమ్మాయి వారికి నచ్చితే నేనే కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తా. ఇక నా ఫోన్ నెంబర్ తీసుకోండి" అంటూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కదం అన్నారు.

If a girl rejects a mans love proposal then I will kidnap her:BJP MLA Ram Kadam

ఎమ్మెల్యే రాంకదమ్ మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయ్యింది. సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడితే మహిళలకు రక్షణ ఎక్కడుంది అని ప్రశ్నించారు జితేంద్ర. వీడియో వైరల్ కావడం బీజేపీ ఎమ్మెల్యే కదంపై తీవ్ర స్థాయిలో నెటిజెన్లు విమర్శలు గుప్పించడంతో ఆయన ఆత్మరక్షణలో పడిపోయారు. తాను మహిళలకు అండగా ఉంటానని చెప్పడం తన ఉద్దేశమని అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని నాలుక కర్చుకున్నారు. ముందుగా పిల్లలు తల్లిదండ్రులకు తెలపాలని మాత్రమే చెప్పినట్లు రాంకదం తెలిపారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుని కొందరు లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామ్ కదమ్ ఏటా గట్కోపర్‌లో దహీ హండీ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయనాయకులు హాజరవుతుంటారు. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA from Ghatkopar Ram Kadam made an outrageous statement during Dahi Handi celebrations in Mumbai on Monday as he offered to “kidnap girls” for boys if their proposal gets rejected. To show that he was serious about his shocking offer, Kadam even gave his mobile number to those in the audience, saying the men could call him to get the girl kidnapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more