మొదటి డోసు తర్వాత కరోనా సోకితే... రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి... కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచన
ఇటీవలి కాలంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కూడా వైరస్ బారినపడిన చూస్తున్నాం. ఇలాంటి కేసులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) దీనిపై స్పందించింది. దేశంలో ఇలాంటి కేసులు కేవలం 0.05శాతం మాత్రమేనని వెల్లడించింది.
కరోనా మొదటి డోసు తీసుకున్న వ్యక్తి వైరస్ బారినపడితే... రెండో డోసును లైట్ తీసుకోవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తప్పనిసరిగా రెండో డోసు కూడా తీసుకోవాల్సిందేనని... అయితే కరోనా నుంచి కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే ఆ డోసును తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ రెండో డోసు ఎవరికి వాయిదా వేయాలంటే :
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ యాక్టివ్ సింప్టమ్స్ ఉన్నవారికి
యాంటీ-కోవిడ్ -19 మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా స్వస్థత కలిగించే ప్లాస్మా ఉన్న కోవిడ్ పేషెంట్లకు
ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రమై ఆస్పత్రుల్లో చేరినవారు

పైన పేర్కొన్నవాళ్లందరికీ... కరోనా నుంచి కోలుకున్న 4-8వారాల తర్వాతే వ్యాక్సిన్ రెండో డోసు ఇవ్వాలి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం... అసింప్టమాటిక్ పేషెంట్లు హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకొచ్చే దశకు చేరుకున్న తర్వాతే వ్యాక్సిన్ రెండో డోసు ఇవ్వాలి. మ్యుటెంట్స్ వేరియంట్స్,ఇతరత్రా కారణాలపై వ్యాక్సిన్ ప్రభావం ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కోవిన్ యాప్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 1 నుంచి ఈ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినప్పటికీ కేవలం 9 రాష్ట్రాలు మాత్రమే దీన్ని ప్రారంభించాయి. మిగతా రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత కారణంగా 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేకపోతున్నాయి. దేశంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే దేశం ఈ పరిస్థితుల్లోకి నెట్టబడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications