ఆధార్ అనుసంధానానికి మార్చి 31 డెడ్‌లైన్: ఆ తర్వాత మీ పాన్ పనిచేయదు!
న్యూఢిల్లీ: మార్చి 31, 2020లోపు పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోకుంటే.. ఇక మీ పాన్ కార్డు పనిచేయదు. ఎందుకంటే మార్చి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులను పని చేయనివిగా పరిగణిస్తామని ఆదాయపుపన్ను శాఖ తాజాగా స్పష్టం చేసింది.
ఇప్పటి ఈ గడువును చాలా సార్లు పెంచామని, ఈ మార్చి లోగా అనుసంధానం చేసుకోని కార్డులను పనిచేయనివిగా గుర్తిస్తామని తేల్చేసింది. అనుసంధానం కోసం ఎన్నోసార్లు అవకాశం కల్పించినప్పటికీ ఇంకా సుమారు 17 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదని వెల్లడించింది.

2017 జులై ఒకటి ముందు జారీయైన కార్డులను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ఐటీశాఖ సూచించింది. లేదంటే సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం పాన్ కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) స్పష్టం చేసింది.
పాన్ కార్డుదారులు ఆధార్ నెంబర్ తెలియజేయకుంటే ఆదాయపుపన్ను చట్టం ప్రకారం తదనంతర పర్యవసానాలకు బాధ్యులు వారేనని పేర్కొంది. కాగా, https://www.incometaxindiaefiling.gov.in/home ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎడమవైపున ఉన్న లింక్ ఆధార్‌పై క్లిక్ చేసి ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications