శశికళపై దీప తీవ్ర వ్యాఖ్యలు, నవ్వేసిన పన్నీరుసెల్వం, ఇది వెంకయ్య మాట..
తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ పీఠం పైన కూర్చోబోతున్నారనే ప్రచారం పైన ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం నాడు తనదైన శైలిలో స్పందించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ పీఠం పైన కూర్చోబోతున్నారనే ప్రచారం పైన ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం నాడు తనదైన శైలిలో స్పందించారు. దీనిపై విలేకరులు అడగగా.. ఆయన తొలుత నవ్వేశారు. ఆ తర్వాత మాట్లాడారు. తాను సముద్రంలోని అలలాంటివాడినని, అంతా దైవ నిర్ణయమని చెప్పారు.
ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆసీనురాలు కాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో 'అమ్మ' జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ అనుసరిస్తున్న వైఖరి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు సైన్యం చేసే విన్యాసంలా ఉందని మండిపడ్డారు.

శశికళకు సీఎం పదవిపై ప్రచారం జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం వరకు వేచి చూడాలని తెలిపారు. అయితే అకస్మాత్తుగా జరిగే అధికార మార్పిడికి ప్రజామోదం లభించే అవకాశాన్ని దీప తోసిపుచ్చారు. ఆమెకు ప్రజామోదం లేదన్నారు.
ఆ పార్టీ అంతర్గత విషయం: వెంకయ్య
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. అది ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ప్రధాన కార్యదర్శి, ఎవరు ఏమిటనే అంశాలు తమకు సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications