వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ బీ-స్కూల్స్‌తో చేతులు కలిపిన ఐఐఎం బెంగళూరు: సాంకేతిక నిపుణులతో ప్రత్యేక ప్రొగ్రాం

జర్మనీకి చెందిన రెండు ప్రీమియర్ బీ-స్కూల్స్(ఫ్రీడ్‌రిచ్ అలెగ్జాండర్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్లాంగెన్-న్యూరెంబర్గ్(ఎఫ్ఏయూ).

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జర్మనీకి చెందిన రెండు ప్రీమియర్ బీ-స్కూల్స్(ఫ్రీడ్‌రిచ్ అలెగ్జాండర్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్లాంగెన్-న్యూరెంబర్గ్(ఎఫ్ఏయూ), ది ఫ్రౌన్హోఫర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐఐఎస్, జర్మనీ ఫర్ ఎన్ ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రాం ఫర్ టెక్నాలజిస్ట్స్(ఐఎంపీటి))తో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విద్యాపరమైన అంశాలను పంచుకోవడం, చర్చించుకోవడం కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్‌బెంగళూరు(ఐఐఎంబీ) చేతులు కలిపింది.

సాంకేతికపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు మూడు మేనేజ్‌మెంట్ స్కూల్స్ కలిసి 'ఐఎంపీటీ'ని రూపొందించడం జరిగింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ మేనేజర్స్, ఆర్అండ్డీ లీడర్లు, ప్రోడక్ట్ డిజైనర్స్, అర్కిటెక్ట్స్, భారత్, యూరోప్‌లలోని మేనేజర్స్ లను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బెంగళూరు, న్యూరెంబర్గ్‌లలో ఈ కార్యక్రమాన్ని అక్కడ ఒక వారం, ఇక్కడ ఒక వారం నిర్వహిస్తోంది.

IIM Bangalore partners with German B-schools to launch International Management Programme for Technologists

ఈ కార్యక్రమం నూతన ఆవిష్కరణలు, సాంకేతిక బిజినెస్ మోడల్స్, ఇంటర్‌ప్రిన్యూర్‌షిప్, ఫ్లాట్‌ఫాం బిజినెస్ మోడల్స్‌పై దృష్టి సారిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం www.iimb.ac.in/eep/impt సంప్రదించండి. ఇతర వివరాల కోసం ఫోన్: 080-26993380 సంప్రదించండి.

ఐఐఎం బెంగళూరు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్స్ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. 'ఐఎంపీటీసీ గ్లోబల్ బిజినెస్ కోసం పలు కీలక అంశాలను పంచుకుంటున్నాయి. ఇండియన్, జర్మనీ సాంకేతిక పద్దతులను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. జర్మనీలో ఇండస్ట్రీ 4.0కు ఎర్లాంగెన్ న్యూరెంబర్గ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. అలాగే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు వైబ్రంట్ టెక్నాలజీ స్టార్టప్ ఇకో సిస్టమ్‌కు ప్రసిద్ధి చెందింది' అని తెలిపారు.

ఈ భాగస్వామ్యంలోనిపుణులైన పరిశోధకులతో స్ట్రాటజిక్ ఇన్నోవేషన్, కో-ఆపరేషన్, మేనేజ్‌మెంట్ , ఆర్గనైజేషన్స్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ల విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్నోవేషన్ అండ్ వ్యాల్యూక్రియేషన్(ఫ్రీడ్‌రిచ్ అలెగ్జాండర్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్లాంగెన్-న్యూరెంబర్గ్) ఛైర్ పర్సన్ డా. కత్రిన్ ఎం మోస్లేన్ మాట్లాడుతూ.. ' షేరింగ్ ఎకనామీలో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవడం, లీవరేజ్ వల్ల ఎలా లాభాలు పొందడం అనే అంశాలపై ఐఎంపీటీ భాగస్వాములకు వివరిస్తుంది. ఇంటర్‌ప్రిన్యూర్‌షిప్‌నకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దీని వల్ల గ్లోబల్ బిజినెస్ సులభతరమవుతుంది. ఫంక్షనల్, కల్చరల్, జీయోగ్రాఫికల్ అంశాలను టీంలు పంచుకోవడం జరుగుతుంది' అని వివరించారు.

ఐఎంపీటీ ప్రొగ్రాం నేర్చుకునే బహుళ విధానాలను తెలియజేస్తుంది. అంతేగాక, వర్క్ షాప్స్, చర్చలు, ఎక్సర్‌సైజ్‌లు, సైట్ విజిట్స్, అత్యుత్తమ నిపుణుల నుంచి సాంకేతిక పరమైన అంశాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఔత్సాహికులకు నూతన ఆవిష్కరణలు, నూతన సంకేతిక విజ్ఞానాన్ని అందించడంలో ఎంతో దోహదం చేస్తుంది. Fraunhofer IIS సైట్ ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకోవచ్చు.

English summary
The Indian Institute of Management Bangalore (IIMB) has announced a partnership with two premier German B-schools – the Friedrich Alexander University of Erlangen-Nuremberg (FAU) and the Fraunhofer Institute for Integrated Circuits IIS, Germany for anInternational Management Programme for Technologists (IMPT), an innovative Executive Education Programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X