రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో ఎన్టీఆర్ గ్లింప్స్.. 180 సెకన్లపాటు గూస్ బంప్స్ పక్కా..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం "పెద్ది" .. జూన్ 4 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు మరో 20 రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పెద్ది' మేనియా నడుస్తోంది. ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. క్రికెట్, కుస్తీ పోటీలు, విజయనగరం గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది సినిమాలోని గ్లింప్స్, పాటలు అంచనాలను మరింత పెంచేశాయి. ఇక త్వరలోనే పెద్ది సినిమా నుంచి ఓ మాస్ సాంగ్ ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది చిత్రం కోసం నార్త్ అమెరికాలో బుకింగ్స్ భారీ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. చరణ్ క్రేజ్‌ కు తోడు బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ తోడవ్వడంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. అయితే పెద్ది టీమ్ నుంచి నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది. పెద్ది మూవీలో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ గ్లింప్స్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ రెండు భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ గా ఎలా ఉండబోతున్నారో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ramcharan Peddi Gives First Glimpse of NTR s Dragon 180 Seconds That Will Give You Goosebumps

ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+