షాక్: ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్‌‌పై సుప్రీంకోర్టు స్టే

ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్ధులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ:ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్ధులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రశ్నాపత్రంలో 18 తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో ఐఐటి జేఈఈ ఆడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది. దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులపై తీర్పు ప్రభావం చూపనుంది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదావేసింది.

IIT-JEE Advanced 2017: Supreme Court stays admissions, counselling over grant of extra mark

దీనికితోడు దేశంలోని ఏ హైకోర్టు కూడ ఇక ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులను తీసుకోవద్దని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా శనివారంలోపుగా ఈ ప్రవేశ పరీక్షపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల గురించి వాటిని వేసిన పిటిషనర్ల సంఖ్య వివరాలను తెలపాలని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరళ్ళను ఆదేశించింది.

హిందీ భాష ప్రశ్నాపత్నం ముద్రణంలో తప్పిదాల వల్ల జేఈఈ ప్రవేశపరీక్ష రాసిన వారందరికీ అదనంగా ఏడు మార్కులు కలపడంపై కేంద్రానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+