వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై హెలికాఫ్టర్‌ సక్సెస్‌లో భారతీయ ఇంజనీర్‌- బాబ్‌ బలరాం ఎవరో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

భూమి తర్వాత మరో గ్రహంపై జీవుల సంచారమే గగనంగా భావిస్తున్న పరిస్ధితుల్లో అంగారకుడిపై హెలికాఫ్టర్‌ ఎగరేసి భవిష్యత్తుపై ఆశలు రేపింది నాసా. నిన్న జరిగిన ఇంజెన్యుటీ హెలికాఫ్టర్ ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఔత్సాహికులకు అంతరిక్ష ప్రయోగాలపై ఆశలు కల్పించిన నాసా.. ఈ విజయంతో మరిన్ని ప్రయోగాలకు సిద్దమవుతోంది. అయితే నాసా విజయవంతంగా ఎగరేసిన ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్ వెనుక నాసాలో ఉన్న ఓ భారతీయుడు కీలక పాత్ర పోషించారు. మద్రాస్‌ ఐఐటీ పూర్వవిద్యార్ది అయిన బాబ్‌ బలరామ్‌ నాసాలో 20 ఏళ్లుగా ఇంజనీర్‌గా ఉన్నారు. చారిత్రక ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌ ప్రయోగంతో ఆయన పేరు మార్మోగుతోంది.

 అంగారకుడిపై ఎగిరిన ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌

అంగారకుడిపై ఎగిరిన ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌

అంగారకుడిపై జీవరాసి మనుగడకు ఉన్న అవకాశాల్ని అధ్యయనం చేసే క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా ప్రయోగించిన రోవర్‌ ఇన్‌జెన్యుటీ అనే ఓ చిన్నపాటి హెలికాఫ్టర్‌ను కూడా మోసుకెళ్లింది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా భూమి నుంచే ఆ హెలికాఫ్టర్‌ను అంగారకుడిపై ఎగరేసింది. మార్స్‌పై ఎగిరిన ఆ హెలికాఫ్టర్‌ భవిష్యత్తులో అంగారకుడిపై ఎన్నో ప్రయోగాలకు ఊతమిచ్చింది. దీంతో అంగారకుడిపై ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్ ప్రయోగాన్ని చూసి ప్రపంచదేశాలు అబ్బురపడుతున్నాయి.

 ఇన్‌జెన్యుటీ సక్సెస్‌ వెనుక భారతీయుడు

ఇన్‌జెన్యుటీ సక్సెస్‌ వెనుక భారతీయుడు

ఇప్పటికే నాసా నిర్వహిస్తున్న ఎన్నో అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయులు భాగస్వాములవుతున్నారు. గతంలో కల్పనా చావ్లా, సునీతా నారాయణ్ వంటి మహిళలు సైతం నాసా ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు చారిత్రక ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌ ప్రయోగంలోనూ భారత సంతతికి చెందిన బాబ్‌ బలరామ్‌ అనే ఇంజనీర్‌ కీలక పాత్ర పోషించారు. ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్‌ను నాసా నుంచి నియంత్రించిన బృందంలో బాబ్ బలరామ్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. ఆయన 20 ఏళ్లుగా నాసాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

 మద్రాస్‌ ఐఐటీ పూర్వ విద్యార్ది

మద్రాస్‌ ఐఐటీ పూర్వ విద్యార్ది

మద్రాస్‌ ఐఐటీలో 1975-80 బ్యాచ్‌కు చెందిన బాబ్‌ బలరామ్‌ ప్రస్తుతం నాసా ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌ ప్రయోగానికి ఛీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. మద్రాస్‌ ఐఐటీ నుంచి బాబ్‌ బలరామ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ డిగ్రీ అందుకున్నారు. మద్రాస్‌ ఐఐటీలో బీటెక్ తర్వాత బాబ్‌ బలరామ్‌ అమెరికాలోని పురాతన విద్యాసంస్ధల్లో ఒకటైన రెన్‌సెలార్ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్‌, సిస్టమ్‌ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అదే సంస్ధ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు. ఆ తర్వాత నాసా అపోలో మూన్ ల్యాండింగ్‌ మిషన్‌లో పాలుపంచుకున్నారు.

 నాసాలో 20 ఏళ్లుగా సేవలు

నాసాలో 20 ఏళ్లుగా సేవలు

బాబ్ బలరామ్‌ నాసాలో 20 ఏళ్లుగా వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీలో ఛీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. ఈ ల్యాబ్‌ అంగారకుడిపై ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్‌ ప్రయోగానికి కావాల్సిన పరికరాల్ని అందించింది. గతంలో అంగారకుడిపై ప్రెసిషన్ ల్యాండింగ్‌ పద్ధతులపైనా ఆయన పరిశోధనలు నిర్వహించారు. గ్రహాలపై వెళ్లే విషయంలో అడ్వాన్స్‌ సిమ్యులేషన్ టెక్నిక్స్‌పైనా అధ్యయనాలు చేశారు. నాసా పర్‌సీవరెన్స్‌ రోవర్‌ ప్రయోగానికి కావాల్సిన సిమ్యులేటర్‌ అభివృద్ధి చేసిన టీమ్‌కు ఆయన నాయకత్వం కూడా వహించారు.

English summary
Indian-origin engineer Bob Balaram is the man behind Mars Ingenuity helicopter, who has worked with Nasa for 20 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X