చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ దాడులు: శశికళ వదిన ఇళవరసి కుమార్తె ఇంటిలో సోదాలు, విచారణకు హాజరైన అల్లుడు !

అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కారానికి గురైన శశికళ వదిన ఇళరవసి అల్లుడు రాజరాజన్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. శుక్రవారం చెన్నైలోని నుంగంబాక్కంలోని ఐటీ శాఖ కార్యా

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కారానికి గురైన శశికళ వదిన ఇళరవసి అల్లుడు రాజరాజన్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. శుక్రవారం చెన్నైలోని నుంగంబాక్కంలోని ఐటీ శాఖ కార్యాయంలో ఇళవరసి అల్లుడు రాజరాజన్ హాజరైనాడు.

Recommended Video

శశికళ పెరోల్ పై వచ్చి ఏం చేసిందో తెలుసా ? | Oneindia Telugu

ఇళవరసి కుమార్తె కృష్ణ ప్రియ ఇంటిలో ఐదు రోజుల పాటు సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు కొన్ని రూ. వందల కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాధించారని గుర్తించారు. కృష్ణ ప్రియ, ఆమె సోదరుడు వివేక్ ఇంటిలో దాదాపు రూ. 1, 430 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు.

Ilavarasi son-in-law Rajarajan today appeared before the Incom Tax Officers.

రూ. 1, 430 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలకు ఆదాయపన్ను శాఖలో లెక్కలు లేవని అధికారులు అంటున్నారు. కృష్ణ ప్రియ, వివేక్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలకు, ఇళవరసి అల్లుడు రాజరాజన్ కు సంబంధం ఉందని వెలుగు చూడటంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు.

శుక్రవారం విచారణకు హాజరుకావాలని రాజరాజన్ కు ఆదాయపన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ శాఖ అధికారుల ఆదేశాల మేరకు రాజరాజన్ విచారణకు హాజరైనారు. ఆదాయన్ను శాఖ సోదాలు తుస్సుమన్నాయని, అవి పేలలేదని టీటీవీ దినకరన్ ఎద్దేవ చేస్తున్నారు.

English summary
IT Raids, Ilavarasi son-in-law Rajarajan today appeared before the Incom Tax Officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X