వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబార్షన్ రాకెట్: డ్రైనేజీలో 19గర్భస్థ పిండాలు, వైద్యుడి అరెస్ట్

మహారాష్ట్రలో సంచలనంగా మారిన అక్రమ అబార్షన్ రాకెట్ గుట్టురట్టయింది. అక్ర‌మ అబార్ష‌న్లు నిర్వ‌హించిన డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఖిద్ర‌పురేను పోలీసులు అరెస్టు చేశారు. క‌ర్ణాట‌క‌లోని బెల్గామ్‌లో అత‌న్ని అదుపులోక

|
Google Oneindia TeluguNews

బెల్గామ్: మహారాష్ట్రలో సంచలనంగా మారిన అక్రమ అబార్షన్ రాకెట్ గుట్టురట్టయింది. అక్ర‌మ అబార్ష‌న్లు నిర్వ‌హించిన డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఖిద్ర‌పురేను పోలీసులు అరెస్టు చేశారు. క‌ర్ణాట‌క‌లోని బెల్గామ్‌లో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

ఓ మురికి కాలువలో సుమారు 19 ఆడ గర్భస్థ పిండాల‌ను పోలీసులు గుర్తించారు. మైసాల్ గ్రామంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కేంద్రంగా ఈ దందా సాగిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల ఓ అక్ర‌మ అబార్ష‌న్ విక‌టించ‌డంతో ఓ మ‌హిళ మృతిచెందింది.

Illegal abortion racket busted in Sangli, 19 aborted female foetuses found

ఆ కేసును చేధిస్తున్న పోలీసుల‌కు ఈ భ‌యంక‌ర‌మైన‌ గుట్టు చిక్కింది. క్లినిక్‌కు కొద్ది దూరంలో పిండాలు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భార‌తి ఆస్పత్రికి చెందిన డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఖిద్ర‌పురే కోసం పోలీసులు గాలించారు.

చివ‌ర‌కు అత‌న్ని క‌ర్ణాట‌క‌లో అరెస్టు చేశారు. హోమియోప‌తిలో డాక్ట‌ర్ ఖిద్రికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉన్న‌ట్లు సంగ్లి జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, దాదాపు ప‌దేళ్ల నుంచి ఆ డాక్ట‌ర్ క్లినిక్ న‌డుస్తున్న‌ట్లు స్థానికులు తెలిపారు.

English summary
Nineteen aborted female foetuses were on Monday found dumped near a stream at a village in Sangli district of western Maharashtra, the police said. Probing the case of a pregnant woman's death during abortion, the police had reached the stream in Mhaisal village where it found the foetuses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X