Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: నా భార్యకు ఆ విషయంలో ?, 8 ఏళ్లుగా అదే పంచాయితీ, గొడ్డలితో నరికి చంపేసిన భర్త !

రాజ్ కోట్: పెళ్లి చేసుకున్న యువకుడు అతని భార్యతో సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు దంపతులు హ్యాపీగానే ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తోందని, తనకు అన్యాయం చేస్తోందని ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చెయ్యడంతో కళ్లు మూసుకుని ఒకే ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే అక్రమ సంబంధం విషయంలో భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన భర్త గొడ్డలి తీసుకుని భార్యను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

 10 ఏళ్ల క్రితం పెళ్లి

10 ఏళ్ల క్రితం పెళ్లి

రాజ్ కోట్ సమీపంలోని జస్థాన్ ప్రాంతంలో సునీల్ పర్మార్ అలియాస్ సునీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూసిన దయా అనే యువతితో సునీల్ పర్మార్ వివాహం జరిగింది. దయాను పెళ్లి చేసుకున్న సునీల్ అతని భార్యతో సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నాడు.

 రెండేళ్ల క్రితం మొదలైయిన పంచాయితీ

రెండేళ్ల క్రితం మొదలైయిన పంచాయితీ

పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు సునీల్, దయా దంపతులు హ్యాపీగానే ఉన్నారు. రానురాను సునీల్, దయా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య దయా వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తోందని, తనకు అన్యాయం చేస్తోందని ఆమె భర్త సునీల్ కు అనుమానం మొదలైయ్యింది.

 భార్య తీరుకూడా అలేగా ఉంది

భార్య తీరుకూడా అలేగా ఉంది

వ్యవసాయం చేస్తున్న సునీల్ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. పగటి పూట సునీల్ భార్య దయా ఇంట్లోనే ఉంటున్నది. ఇదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న యువకుడితో దయా ఎక్కువ చనువుగా ఉంటున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి దగ్గర యువకుడితో చనువుగా ఉంటున్న తన భార్య దయాకు ఆమె పుట్టింటి దగ్గర ఓ లవర్ ఉన్నాడని సునీల్ ఇంకా అనుమానం పెంచుకున్నాడు.

 భార్యను గొడ్డలితో నరికేసిన భర్త

భార్యను గొడ్డలితో నరికేసిన భర్త

గత 8 సంవత్సరాల నుంచి ఇదే విషయంలో సునీల్, దయా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చెయ్యడంతో కళ్లు మూసుకుని ఒకే ఇంట్లో సునీల్, దయా దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే అక్రమ సంబంధం విషయంలో అర్దరాత్రి సునీల్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన సునీల్ గొడ్డలి తీసుకుని అతని భార్య దయా తల మీద, వీపు మీద దారుణంగా నరికేశాడు.

 అల్లుడి మీద కేసు పెట్టిన మామ

అల్లుడి మీద కేసు పెట్టిన మామ

తీవ్రగాయాలైన దయాను రాజ్ కోట్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై మరుసటి రోజు దయా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసు అధికారులు అన్నారు. దయా తండ్రి జీవాబాయ్ చిటారియా కేసు పెట్టడంతో సునీల్ ను మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+