Illegal affair: ప్రియుడిని తమ్ముడిగా పరిచయం చేసిన భార్య, ఐదు మందితో లేడీ, ఇద్దరూ ఫినిష్ !
లక్నో/చెన్నై: భార్య, పిల్లలతో కలిసి భర్త సంతోషంగానే జీవితం సాగిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన తమ్ముడు అంటూ భార్య ఓ యువకుడిని ఆమె భర్తకు పరిచయం చేసింది. వారానికి ఒకరోజు ఆ యువకుడు ఆమె ఇంటికి వెలుతున్నాడు. ఆ యువకుడు తన భార్య తమ్ముడు అని ఆమె భర్త పూర్తిగా నమ్మేశాడు. అయితే తమ్ముడిగా పరిచయం చేసిన యువకుడు తన భార్యకు ప్రియుడు అని భర్త గుర్తించలేకపోయాడు. రెండు సంవత్సరాలుగా భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ఇదే సమయంలో తన వివాహిత ప్రియురాలికి మరో ముగ్గురితో అక్రమ సంబంధం ఉందని ఆమె ప్రియుడికి తెలిసింది. ఇదే విషయంలో వివాహిత మహిళతో ప్రియుడు గొడవ పడుతూ వచ్చాడు. నువ్వు ఏమైనా ద్రోపతివా ? ఐదు మందితో కాపురం చెయ్యడానికి అంటూ ప్రియుడు నిలదీశాడు. వివాహిత మహిళ, ఆమె భర్తతో ప్రియుడు గొడవపడ్డాడు. నీ భార్యను కంట్రోల్ లో పెడుతావా ? లేదా ? అంటూ ప్రియుడు భర్తను నిలదీశాడు. నా భార్య ఆమె ఇష్టం వచ్చినట్లు ఉంటుంది, అడగడానికి నువ్వు ఎవరు అంటూ భర్త ప్రియుడికి వార్నింగ్ ఇచ్చాడు. మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన ప్రియుడు కత్తి తీసుకుని అతని ప్రియురాలు, ఆమె భర్తను ఒకేసారి హత్య చెయ్యడం కలకలం రేపింది.

ముగ్గురు పిల్లల తల్లి
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోని బ్రహ్మపురి ప్రాంతంలో ఆబాద్, జుబేదా దంపతులు నివాసం ఉంటున్నారు. ఆబాద్, జుబేదా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య జుబేదా, పిల్లలతో కలిసి ఆబాద్ చాలాకాలం సంతోషంగానే జీవితం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న ఆబాద్ రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు.

ప్రియుడిని తమ్ముడిగా భర్తకు పరిచయం చేసిన భార్య
రెండు సంవత్సరాల క్రితం సమీర్ అనే యువకుడిని తన తమ్ముడు అంటూ భార్య జుబేదా ఆమె భర్త ఆబాద్ కు పరిచయం చేసింది. వారానికి ఒకరోజు సమీర్ జుబేదా ఇంటికి వెలుతున్నాడు. సమీర్ తన భార్య జుబేదా తమ్ముడు అని ఆమె భర్త ఆబాద్ పూర్తిగా నమ్మేశాడు. అయితే అసలు మ్యాటర్ వేరే అని ఆబాద్ గుర్తించలేకపోయాడు.

ప్రియుడితో మస్త్ మజా చేసిన భార్య
రెండు సంవత్సరాలుగా జుబైదా ఆమె ప్రియుడు సమీర్ తో ఎంజాయ్ చేస్తోంది. భర్త ఆబాద్ బయటకు వెళ్లిన తరువాత అతని ఇంటికి వెలుతున్న సమీర్ ప్రియురాలు జుబైదాతో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వివాహిత ప్రియురాలు జుబైదాకు తాను కాకుండా మరో ముగ్గురితో అక్రమ సంబంధం ఉందని ఆమె ప్రియుడు సమీర్ కి తెలిసింది. ఇదే విషయంలో సమీర్ అతని ప్రియురాలు జుబైదాతో గొడవ పడుతూ వస్తున్నాడు.

నువ్వు ఏమైనా ద్రౌపతివా ? ఐదు మంది కావాలా
నువ్వు ఏమైనా ద్రోపతివా ? ఐదు మందితో కాపురం చెయ్యడానికి అంటూ ప్రియుడు సమీర్ అతని ప్రియురాలు జుబైదాను నిలదీశాడు. నామొగుడే నన్ను ప్రశ్నించలేదు, నువ్వు ఏంది నా దగ్గర పెత్తనం చాలాయిస్తున్నావు, నీకు ఇష్టం ఉంటే నా ఇంటికి రా, లేదంటే లేదు అంటూ జుబైదా ఆమె ప్రియుడు సమీర్ కు ఎదురు తిరిగింది.

నా భార్య ఇష్టం వచ్చిన వారితో తిరుగుతుంది ? నీకెందుకు
వివాహిత మహిళ జుబైదా, ఆమె భర్త ఆబాద్ తో ప్రియుడు సమీర్ ఇదే విషంలో గొడవపడ్డాడు. నీ భార్య జుబైదాను కంట్రోల్ లో పెడుతావా ? లేదా ? అంటూ ఆమె భర్త ఆబాద్ ను సమీర్ నిలదీశాడు. నా భార్య జుబైదా ఆమె ఇష్టం వచ్చినట్లు ఉంటుంది, అడగడానికి నువ్వు ఎవరు అంటూ ఆమె భర్త ఆబాద్ సమీర్ ను హెచ్చరించాడు.

పిల్లల ముందే ప్రియురాలు, ఆమె భర్తను చంపేసిన ప్రియుడు
మాటామాటా పెరిగిపోవడంతో సమీర్ సహనం కోల్పోయాడు. తరువాత సమీర్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని అతని ప్రియురాలు జుబైదా, ఆమె భర్త ఆబాద్ ను కసకసా పొడిచేశాడు. ఎక్కువ కత్తిపోట్లు పడటంతో జుబైదా, ఆమె భర్త ఆబాద్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిల్లలు చూస్తున్న సమయంలో ఒకేసారి జుబైదా, ఆబాద్ దంపతులు హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

సిటీ శివారల్లో మకాం వేసిన ప్రియుడు
పోలీసుల విచారణలో జుబైదా, ఆబాద్ దంపతులను హత్య చేసింది బంధువు అని పిల్లలు పోలీసులకు చెప్పారు. అయితే జుబైదాకు సమీర్ తమ్ముడు కాదని, ప్రియుడు అని వెలుగు చూడటంతో స్థానికులు షాక్ అయ్యారు. మీరట్ శివార్లలో తలదాచుకున్న సమీర్ పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

తమ్ముడి ముసుగులో వచ్చింది ప్రియుడు అని తెలిసి ?
ఆర్థికంగా జుబైదాకు తనతోపాటు ఆమె మరో కొందరు ఆమె ప్రియులు సహాయం చేస్తున్నారని, ఈ విషయాలు మొత్తం తెలిసినా ఆబాద్ భార్య అక్రమ సంబంధాల గురించి పట్టించుకోలేదని, అందుకే కోపంతో చంపేశానని సమీర్ అంగీకరించాడని మీరట్ పోలీసులు అంటున్నారు. ఇంతకాలం జుబైదా కోసం తమ్ముడు ముసుగులో వచ్చిన సమీర్ ఆమె ప్రియుడు అని తెలుసుకున్న ఆమె భర్త ఆబాద్ బంధువులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications