వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: పోలీస్ స్టేషన్ లో బిడ్డతో డ్రామాలు, ట్విస్ట్, ప్రియుడితో తల్లి జల్సా, భర్త ఏం చెప్పాడంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు/రాయచూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది. రాచనగరిలో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. సార్ నేను ఊరికి వెళ్లడానికి బస్ స్టాండ్ లో ఉన్నానని, ఈ బిడ్డను ఆమె తల్లి నా దగ్గరకు ఇచ్చి 10 నిమిషాల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిందని, గంటసేపు అయినా ఆమె తిరిగిరాలేదని, నాకు వేరేపని ఉందని, అర్జెంట్ గా ఊరికి వెళ్లాలని, ఈ బిడ్డను మీరే కాపాడలని చెప్పిన ఆ యువకుడు ఆ బిడ్డను పోలీసులకు అప్పగించి అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు.

పోలీసులు బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన మహిళ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడితో కలిసి జల్సా చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బిడ్డ తండ్రిని పోలీసులు పిలిపించి విచారణ చేశారు. విచారణలో బిడ్డ తండ్రి షాకింగ్ విషయాలు చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. బిడ్డను తెచ్చి పోలీసులకు అప్పగించింది ప్రయాణికుడు కాదని, వాడు అసలైన కేటుగాడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Aunty : ప్రియురాలి మోజులో అంకుల్, కొడుకుతో కలిసి ఆంటీని చంపేసి ?, కూతురి దెబ్బతో సీన్ రివర్స్ !

 బిడ్డతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువకుడు

బిడ్డతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువకుడు

కర్ణాటకలోని మైసూరు నగరంలోని లష్కర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రఘు అనే యువకుడు హంగామా చేశాడు. సార్ నేను ఊరికి వెళ్లడానికి మైసూరు సిటీలోని రాయచూర్ బస్ స్టాండ్ లో ఉన్నానని, ఈ బిడ్డను ఆమె తల్లి నా దగ్గరకు ఇచ్చి 10 నిమిషాల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిందని, గంటసేపు అయినా ఆమె తిరిగిరాలేదని పోలీసులకు చెప్పాడు.

 సైలెంట్ గా ఎస్కేప్

సైలెంట్ గా ఎస్కేప్

బిడ్డను మీరు తీసుకుంటే నాకు వేరేపని ఉందని, అర్జెంట్ గా ఊరికి వెళ్లాలని, ఈ బిడ్డను మీరే కాపాడలని చెప్పిన రఘు ఆ బిడ్డను మైసూరు పోలీసులకు అప్పగించి అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు. పోలీసులు బిడ్డ గురించి ఆరా తీశారు. పోలీసులు మైసూరు సిటీలోని రాయచూర్ బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

 బిడ్డ తల్లి బతికే ఉంది...... బిడ్డ తండ్రి ?

బిడ్డ తల్లి బతికే ఉంది...... బిడ్డ తండ్రి ?

9 నెలల బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన మహిళ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడితో కలిసి జల్సా చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బిడ్డ తండ్రి అడ్రస్ కనుక్కున్న పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

 అక్రమ సంబంధం.... ప్రియుడు, ప్రియురాలు డ్రామాలు

అక్రమ సంబంధం.... ప్రియుడు, ప్రియురాలు డ్రామాలు

విచారణలో బిడ్డ తండ్రి షాకింగ్ విషయాలు చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. బిడ్డను తెచ్చి పోలీసులకు ఇచ్చింది ప్రయాణికుడు కాదని, వాడు నా భార్య ప్రియుడు అని బిడ్డ తండ్రి పోలీసులకు చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన రాయచూరు మహిళ ఇప్పటికే పెళ్లి చేసుకుని బిడ్డ తల్లి అయ్యిందని, ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని తాను సిద్దం అయ్యానని రఘు పోలీసులకు చెప్పాడు.

 సోషల్ మీడియా దెబ్బ..... మొగుడు, బిడ్డను వదిలేసి ?

సోషల్ మీడియా దెబ్బ..... మొగుడు, బిడ్డను వదిలేసి ?

మా పెళ్లికి బిడ్డ అడ్డుగా ఉన్నాడని, అందుకే ఆ బిడ్డ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించి నాటకం ఆడామని రఘు, అతని ప్రియురాలు మైసూరులోని లష్కర్ పోలీసులకు చెప్పారు. బిడ్డ డ్రామా కేసులో ఆ బిడ్డ తల్లితో పాటు రఘు అసలైన కేటుగాడు అని విచారణలో వెలుగు చూసిందని, ఇద్దరి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మైసూరులోని లష్కర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, కడుపులో పుట్టిన బిడ్డను వదిలేసి ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిన రాయచూరు మహిళ ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

l

English summary
Illegal affair: Big twist to woman hand over 9 month baby to Mysuru boy in Raichur bus stand in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X