Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, ప్రియుడు, ఫ్రెండ్స్ కలిసి భర్తను ఏం చేశారంటే ?, క్లైమాక్స్ లో !

బెంగళూరు/బెళగావి: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమే అని యువతి చెప్పింది. యువతి, యువకుడు ఇష్టపడటంతో కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరి పెళ్లి జరిగింది. దంపతులు కొంతకాలం సంతోషంగా జీవనం సాగించారు. భార్యకు ఓ యువకుడితో పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడి అతనితో ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తను పట్టించుకోవడం మానేసింది. ఇదే విషయంలో దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త శవం ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి నదిలో విసిరేయడంతో మూడు రోజుల తరువాత ఆ విషయం పోలీసులకు తెలిసింది. భర్త హత్య కేసు అనేక కోణాల్లో విచారణ చేసిన పోలీసులు అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు, అతని ఫ్రెండ్స్ తో కలిసి తన భర్తను నేనే దారుణంగా హత్య చేయించి శవాన్ని నదిలో పడేశామని భార్య పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.

 పెళ్లికి ఓకే చెప్పిన యువతి

పెళ్లికి ఓకే చెప్పిన యువతి


కర్ణాటకలోని ధారవాడ జిల్లాలోని గూంగుడికోప్ప గ్రామంలో యల్లప్ప లక్షణ అలియాస్ లక్షణ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ధారవాడకు చెందిన సరస్వతి (28) అనే యువతితో లక్షణ వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. టుంబ సభ్యులు చూపించిన లక్ష్మణను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమే అని అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులకు సరస్వతి చెప్పింది.

 దంపతుల వయసులో 11 ఏళ్లు తేడా

దంపతుల వయసులో 11 ఏళ్లు తేడా

లక్ష్మణ, సరస్వతి ఇష్టపడటంతో కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరి పెళ్లి జరిగింది. సరస్వతి, లక్ష్మణ దంపతులకు వయసులో 11 సంవత్సరాల తేడా ఉంది. లక్ష్మణ, సరస్వతి దంపతులు ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా జీవనం సాగించారు. సరస్వతి భర్త లక్ష్మణ వ్యాపారం చేస్తున్నాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

వ్యాపారం చెయ్యడానికి ఎక్కువగా లక్ష్మణ బయట తిరుగుతుండటంతో అతని భార్య సరస్వతి ఇంట్లోనే ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం ధారవాడ జిల్లాలోని హత్తికోళ గ్రామంలో నివాసం ఉంటున్న గోపాల్ సింగ అలియాస్ గోపాల్ (28) అనే యువకుడికి సరస్వతికి పరిచయం అయ్యింది. రానురాను సరస్వతి, గోపాల్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.

 ప్రియుడి మోజులో పడిపోయి భర్తను ?

ప్రియుడి మోజులో పడిపోయి భర్తను ?

ప్రియుడు గోపాల్ తో తిరుగుతూ అతని మోజులో పడిపోయిన సరస్వతి ఆమె భర్త ఊరికి వెళ్లిన సమయంలో ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడు గోపాల్ తో ఎంజాయ్ చేస్తున్న సరస్వతి ఆమె భర్త లక్ష్మణను పట్టించుకోవడం మానేసింది. ఆరు నెలల క్రితం సరస్వతి, గోపాల్ ల అక్రమ సంబంధం విషయం ఆమె భర్త లక్ష్మణకు తెలిసిపోయింది.

భర్త హత్యకు భార్య స్కెచ్

భర్త హత్యకు భార్య స్కెచ్

ఇదే విషయంలో లక్ష్మణ, సరస్వతి దంపతుల మద్య కొన్ని నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఇదే సందర్బంలో లక్ష్మణను మారణాయుధాలు, వేటకొడవళ్లు, కత్తులతో నరికి చేసి అతని శవాన్ని ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి శవాన్ని తీసుకెళ్లి నయానగర సమీపంలోని మలప్రభా నదిలో విసిరేశారు. మూడు రోజుల తరువాత స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్లు శవాన్ని గుర్తించి బైలహోంగల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రియుడితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్న భార్య

ప్రియుడితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్న భార్య

ప్లాస్టిక్ సంచిలో చిక్కిన శవం ఎవరిది అంటూ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. చివరికి హత్యకు గురైయ్యింది లక్ష్మణ అని గుర్తించిన పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేశారు. ఇదే సమయంలో హత్యకు గురైన లక్ష్మణ భార్య సరస్వతి ప్రతిరోజు గంటలు గంటలు ఫోన్ లో గోపాల్ అనే వ్యక్తితో మాట్లాడుతోందని పోలీసులు గుర్తించారు.

ప్రియుడు, అతని ఫ్రెండ్స్ తో కలిసి భర్తను చంపించిన భార్య

ప్రియుడు, అతని ఫ్రెండ్స్ తో కలిసి భర్తను చంపించిన భార్య

లక్ష్మణ హత్య కేసు అనేక కోణాల్లో విచారణ చేసిన పోలీసులు అతని భార్య సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు గోపాల్, అతని ఫ్రెండ్స్ తో కలిసి తన భర్త లక్ష్మణను నేనే వేటకోడవళ్లతో దారుణంగా నరికి హత్య చేయించానని, భర్త శవాన్ని నదిలో పడేశామని సరస్వతి పోలీసులకు చెప్పడం కలకలం రేపింది. లక్ష్మణ హత్య కేసులో అతని భార్య సరస్వతి, ఆమె ప్రియుడు గోపాల్, అతని ఫ్రెండ్స్ కార్తీక్, ప్రకాష్, బసవరాజ్, శంభులింగ అనే ఆరు మందిని అరెస్టు చేశామని ధారవాడ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+