
Illegal affair: లవ్ మ్యారేజ్, ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య, పట్టుకుని వస్తే బావ ఇంట్లో, ఛట్నీ !
చెన్నై/తంజావూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. తరువాత పెద్దలను ఎదిరించిన ప్రేమికులు వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత పెద్దలు వీరితో కలిసిపోయారు. భార్య, బిడ్డలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని అతను అనుకున్నాడు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న భార్య మాత్రం అడ్డదారి తొక్కింది. ఆమె పని చెయ్యడానికి వెలుతున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్యకు బుద్దిమాటలు చెప్పి ఆమె ప్రియుడిని చితకబాదేశాడు. తన భర్త తన సంతోషానికి అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన భార్య ఆమె ప్రియుడితో జెండా ఎత్తేసింది. రెండు నెలల పాటు గాలించి భార్యను వెతికి పట్టుకున్న భర్త ఆమెను ఇంటికి పిలుచుకుని వచ్చాడు. అప్పటి నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో భర్తతో గొడవపడిన భార్య ఆమె అక్కాబావ ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి ఆవేశంలో భార్య అక్క ఇంటికి భర్త వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగిపోవడంతో రగిలిపోయిన భర్త అతని భార్య తల నుజ్జునుజ్జు చేసి చంపేశాడు. పోలీసులు వెళ్లే వరకు భార్య శవం పక్కనే ఆమె భర్త తాపీగా కుర్చోవడం కలకలం రేపింది.
Bedroom: మిడ్ నైట్ రొమాన్స్ రామాయణం, ఆ ఒక్కటి అడక్కు, భర్త మర్మాంగం కోసేసిన భార్య, పరుగో పరుగు !

లవ్ మ్యారేజ్
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని పట్టుకోటై లెట్సతోప్పు ప్రాంతంలో సెల్లాదురై అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తంబికోటై కీలక్కాడు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇందుమతి అనే యువతిని సెల్లాదురై ప్రేమించాడు. సెల్లాదురై, ఇందుమతి ప్రేమను వాళ్ల పెద్దలు వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించిన ఇందుమతి, సెల్లాదురై 9 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

పెద్దలు రాజీ అయిపోయారు
సెల్లాదురై, ఇందుమతి దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత పెద్దలు వీరితో కలిసిపోయారు. భార్య ఇందుమతితో, బిడ్డలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని సెల్లాదురై అనుకున్నాడు. తరువాత సెల్లాదురై, ఇందుమతి దంపతులు వాళ్ల బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. ఇందుమతి, సెల్లాదురై ఇద్దరూ పనులు చేస్తూ డబ్బు సంపాధిస్తున్నారు.

యువకుడితో భార్య అక్రమ సంబంధం
ఇందుమతి ఆమె పని చేస్తున్న చోట ఓ యువకుడితో పరిచయం పెట్టుకుంది. పని చేస్తున్న చోట పరిచయం అయిన యువకుడితో ఇందుమతి అక్రమ సంబంధం పెట్టుకుంది. సాయంత్రం పని పూర్తి అయిన తరువాత ప్రియుడితో కలిసి తిరుగుతున్న ఇందుమతి ఆమె పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకుంటున్నది.

భార్యకు బుద్దిమాటలు..... ప్రియుడిని చితకబాదిన భర్త
ఇందుమతి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త సెల్లాదురైకి తెలిసిపోయింది. పని చెయ్యడానికి వెలుతున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇందుమతి అతనితో ఎంజాయ్ చేసింది. విషయం తెలుసుకున్న సెల్లాదురై అతని భార్య ఇందుమతికి పద్దతి మార్చుకోవాలని బుద్దిమాటలు చెప్పాడు. ఇందుమతి ప్రియుడిని సెల్లాదురై చితకబాదేసి ఇంకోసారి తన భార్య జోలికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య
తన భర్త సెల్లాదురై తన సంతోషానికి అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన అతని భార్య ఇందుమతి దీపావళి పండుగ మరుసటి రోజు ఆమె ప్రియుడితో జెండా ఎత్తేసింది. ప్రియుడితో కలిసి పారిపోయిన ఇందుమతి అతనితో సేలం జిల్లాలో కాపురం పెట్టింది. రెండు నెలల పాటు సెల్లాదురై అతని భార్య ఇందుమతి కోసం గాలించి చివరికి ఆమెను వెతికి పట్టుకుని ఇంటికి పిలుచుకుని వచ్చాడు.

బావ ఇంటికి వెళ్లిపోయింది
అప్పటి నుంచి సెల్లాదురై, ఇందుమతి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నాలుగు రోజుల క్రితం భర్త సెల్లాదురైతో గొడవపడిన అతని భార్య ఇందుమతి వేలంగాని సమీపంలోని అయిమజి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె అక్కా సెల్వి, బావ శంకర్ ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంది.

భార్యను చంపేసి శవం పక్కన కుర్చున్న భర్త
బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పీకలదాక మద్యం సేవించిన సెల్లాదురై ఆవేశంలో భార్య బావ శంకర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ సెల్లాదురై, ఇందుమతి దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో రగిలిపోయిన సెల్లాదురై అతని భార్య ఇందుమతిని ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వెళ్లి ఆమె తల మీద బండరాయి వేసి నుజ్జునుజ్జు చేసి చంపేశాడు. పోలీసులు వెళ్లే వరకు భార్య ఇందుమతి శవం పక్కనే సెల్లాదురై తాపీగా కుర్చోవడం కలకలం రేపింది.