Illegal affair: లవ్ మ్యారేజ్, భార్య కిటికీలో చూసినా, తలుపు తిసినా భర్త ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ లో కథ !

సాంబాల్ పూర్/ఒడిశా: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన మూడు సంవత్సరాల తరువాత మహిళ కుటుంబ సభ్యులు దంపతులతో రాజీ అయ్యారు. రానురాను భార్య ప్రవర్తన మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. తన కంటే తన భార్యకు 10 ఏళ్ల వయసు తక్కువని, అందుకే వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య తలుపు తీసినా, కిటికీలో చూసినా, ఎరితోనైనా మొబైల్ లో మాట్లాడినా భర్తకు విపరీతమైన అనుమానం వచ్చి ఆమెను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. పెద్దలు కొంతకాలం రాజీ చేశారు. ఇంట్లో భర్త టార్చర్ ఎక్కువ అయ్యిందని భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తారింటికి వెళ్లిన భర్త ఏదో పొరపాటు జరిగిపోయిందని ,ఇక ముందు బుద్దిగా ఉంటానని భార్యకు, ఆమె తండ్రికి చెప్పాడు. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పాడు. భర్తతో కలిసి అతని ఇంటికి వెళ్లడానికి భార్య అంగీకరించింది. సాయంత్రం భార్యను పిలిచుకుని ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి భర్త అతని భార్యను సజీవదహనం చెయ్యడం కలకలం రేపింది.

లవర్స్ హ్యాపీలైఫ్

లవర్స్ హ్యాపీలైఫ్

ఒడిశాలోని సంబల్ పూర్ సమీపంలోని కూచిండాలోని ఘటాతంగర్ గ్రామంలో రఘురాజ్ అలియాస్ రాజ్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రఘరాజ్ లిలిమా రాణా (35) అనే యువతిని ప్రేమించాడు. కొన్ని సంవత్సరాల పాటు రఘరాజ్, లిలిమా రాణా ప్రేమించుకుని చివరికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

లేచిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులు

లేచిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులు


రఘురాజ్, లిలిమా రాణా పెళ్లికి వాళ్ల పెద్దలు అంగీకరించకపోవడంతో 7 సంవత్సరాల క్రితం ఊరి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న రఘురాజ్, లిలిమా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన మూడు సంవత్సరాల తరువాత లిలిమా రాణా కుటుంబ సభ్యులు దంపతులతో రాజీ అయ్యారు.

 రెండేళ్ల క్రితం భార్య ప్రవర్తనతో ?

రెండేళ్ల క్రితం భార్య ప్రవర్తనతో ?

రెండు సంవత్సరాల క్రితం నుంచి లిలిమా రాణా ప్రవర్తనలో మార్పులు వచ్చాయని తెలిసింది. రానురాను భార్య లిలిమా రాణా ప్రవర్తన మీద ఆమె భర్త రఘురాజ్ కు అనుమానం పెరిగిపోయింది. తన భార్య లిలిమా రాణాకు తనకంటే 10 ఏళ్ల వయసు తక్కువని, అందుకే ఆమె వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త రఘురాజ్ లో అనుమానం మొదలైయ్యింది.

భార్య తలుపు తీసినా, కిటికీలో చూసి భర్తకు డౌట్

భార్య తలుపు తీసినా, కిటికీలో చూసి భర్తకు డౌట్

భార్య లిలిమా రాణా తలుపు తీసినా, ఆమె కిటికీలో చూసినా, ఎరితోనైనా మొబైల్ లో మాట్లాడినా ఆమె భర్త రఘురాజ్ కు విపరీతమైన అనుమానం వచ్చి ఆమెను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. పెద్దలు కొంతకాలం రాజీ చేశారు. ఇంట్లో భర్త టార్చర్ ఎక్కువ అయ్యిందని భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యకు నైస్ గా మాటలు చెప్పి ?

భార్యకు నైస్ గా మాటలు చెప్పి ?

కొన్ని రోజులు భార్య లిలిమా రాణాకు ఫోన్ చేసిన రఘురాజ్ తన ఇంటికి వచ్చేయాలని చెప్పాడు. అయితే రఘురాజ్ మాటలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. చివరికి అత్తారింటికి వెళ్లిన రఘురాజ్ ఏదో పొరపాటు జరిగిపోయిందని ,ఇక ముందు బుద్దిగా ఉంటానని అతని భార్య లిలిమా రాణాకుకు, ఆమె తండ్రికి మాయమాటలు చెప్పాడు.

 భార్యను నమ్మించి తీసుకెళ్లి ఏం చేశాడంటే ?

భార్యను నమ్మించి తీసుకెళ్లి ఏం చేశాడంటే ?


భార్య లిలిమా రాణాతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పాడు. భర్త రఘురాజ్ తో కలిసి అతని ఇంటికి వెళ్లడానికి భార్య లిలిమా రాణా అంగీకరించింది. సాయంత్రం భార్య లిలిమా రాణాను పిలిచుకుని ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి లిలిమా రాణాతో ఆమె భర్త రఘురాజ్ పెద్ద గొడవపడ్డాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రఘురాజ్ ఇంట్లో ఉన్న కిరోసిన్ అతని భార్య లిలిమా రాణా మీద పోసి నిప్పంటించాడు.

 భార్యను సజీవదహనం చేశాడు

భార్యను సజీవదహనం చేశాడు

కిరోసిన్ ఎక్కువగా మీద పడటం, వెంటనే మంటలు వ్యాపించడంతో లిలిమా రాణా సజీవదహనం అయ్యింది. భార్యను దారుణంగా హత్య చేసి రఘురాజ్ ను అరెస్టు చేశామని, అతను మద్యం మత్తులో అతని భార్య లిలిమా రాణాను హత్య చేసి ఉంటాడని పోలీసు అధికారులు తెలిపారు. చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+