Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తకు బాయ్ బాయ్, బావతో మరదలు ఎస్కేప్, కాళ్లు, చేతులు కట్టేసి నదిలో తోసిన అక్క !

అహమ్మదాబాద్/ చెన్నై: భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త వ్యాపారం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇంటికి వచ్చి వెలుతున్న మరదలితో బావ సరసాలు ఆడాడు. ఇప్పటికే మరదలికి వివాహం జరిగింది. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న మరదలు కూడా బావ కోరికలు తీరుస్తూ ఆమె కోరికలు కూడా ఎప్పటికప్పుడు తీరుస్తోంది. చాలా కాలం వరకు తన చెల్లెలు తన భర్తతో ఎంజాయ్ చేస్తోందనే విషయం ఆమె అక్కకు ఏమాత్రం తెలీలేదు. చాలా కాలం తరువాత బావ, మరదలి వ్యవహారం బయటపడిపోయింది. పెద్దలు పంచాయితీలు చేసి బావా మరదలికి బుద్దిమాటలు చెప్పారు. కొంతకాలానికి భర్తకు బాయ్ బాయ్ చెప్పిన మరదలు ఆమె బావతో కలిసి చెక్కేసింది. మరదలితో వేరే ప్రాంతంలో కాపురం పెట్టిన బావ ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు.

కొంతకాలం తరువాత భర్తను పట్టుకుని వచ్చిన భార్య అతనికి బుద్దిమాటలు చెప్పింది. తరువాత అక్కతో వేరుగా, మరదలితో వేరుగా కాపురం పెట్టిన బావ ఇద్దరితో జల్సాలు చేస్తున్నాడు. కొంతకాలం తరువాత నీకు నేను మోసం చేశానని, నీ చెల్లి మైకంలో పడిపోయి నీకు ద్రోహం చేశానని, మనం ఇద్దరం సంతోషంగా ఉండాలంటే నీ చెల్లిని చంపేద్దామని భర్త అతని భార్యకు చెప్పాడు. నా మొగుడు నాకు మాత్రమే సొంతం కావాలంటే చెల్లిని చంపేయాలని అక్కడ కూడా డిసైడ్ అయ్యింది. అంతే భార్యతో కలిసి భర్త అతని మరదలిని నమ్మించి పిలుచుకుని వెళ్లారు. తరువాత ముఖానికి స్ప్రే కొట్టి కాళ్లు, చేతులు కట్టేసి ఆమెను బతికుండగానే నదిలో విసిరేశారు. భార్యతో కలిసి మరదిలిని చంపేసిన బావ సంవత్సరం తరువాత పోలీసులకు చిక్కడం కలకలం రేపింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని సోలా ప్రాంతంలో హితేంద్ర పటేల్ (50) అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం పునిత (45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భార్య పునితతో చక్కగా కాపురం చేస్తున్న ఆమె భర్త హితేంద్ర పటేల్ మంచి వ్యాపారం చేస్తున్నాడు. హితేంద్ర పటేల్, పునిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 అక్క కోసం వెళ్లి బావతో సరసాలు

అక్క కోసం వెళ్లి బావతో సరసాలు

పునితకు కోమల అనే చిన్న చెల్లెలు ఉంది. అప్పుడప్పుడు కోమల ఆమె అక్క పునిత ఇంటికి వెళ్లేది. ఆ సమయంలో కోమల అక్క భర్త హితేంద్ర పటేట్ తో చనువుగా ఉండేది. రానురాను హితేంద్ర పటేల్, మరదలు కోమల దగ్గర అయ్యారు. భార్య పునిత ఇంటికి వచ్చి వెలుతున్న మరదలు కోమలతో ఆమె బావ హితేంద్ర పటేట్ సరసాలు ఆడాడు. ఇప్పటికే మరదలు కోమలకి వివాహం జరిగింది.

 బావా, మరదలికి డబుల్ డ్యూటీ

బావా, మరదలికి డబుల్ డ్యూటీ

వివాహం చేసుకుని భర్తతో వేరే ప్రాంతంలో కాపురం చేస్తున్న మరదలు కోమల కూడా ఆమె బావ హితేంద్ర పటేల్ కోరికలు తీరుస్తూ ఆమె కోరికలు కూడా ఎప్పటికప్పుడు తీరుస్తోంది. భర్తతో కోమల ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఇక్కడ బావ హితేంద్ర పటేల్ తో ఎంజాయ్ చేస్తోంది, మరో వైపు భార్య పునితో ఎంజాయ్ చేస్తున్న హితేంద్ర పటేల్ మరదలు కోమలతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

బుద్దిమాటలు చెప్పిన బంధువులు

బుద్దిమాటలు చెప్పిన బంధువులు

చాలా కాలం వరకు తన చెల్లెలు కోమల తన భర్త హితేంద్ర పటేల్ తో ఎంజాయ్ చేస్తోందనే విషయం ఆమె అక్క పునితకు ఏమాత్రం తెలీలేదు. చాలా కాలం తరువాత బావ హితేంద్ర పటేల్, అతని మరదలు కోమల వ్యవహారం బయటపడిపోయింది. పెద్దలు పంచాయితీలు చేసి బావా హితేంద్ర పటేల్ తోపాటు అతని మరదలు కోమలకు బుద్దిమాటలు చెప్పారు.

 భర్తకు బాయ్ బాయ్ చెప్పి బావతో ఎస్కేప్

భర్తకు బాయ్ బాయ్ చెప్పి బావతో ఎస్కేప్

కొంతకాలం హితేంద్ర పటేల్, అతని మరదలు కోమల సైలెంట్ గా ఉన్నారు. కొంతకాలానికి హితేంద్ర పటేల్, మరదలు కోమల దగ్గర అయ్యారు. 2019లో భర్తకు బాయ్ బాయ్ చెప్పిన మరదలు కోమల ఆమె బావ హితేంద్ర పటేట్ తో కలిసి అహమ్మదాబాద్ నుంచి చెక్కేసింది. వేరే ప్రాంతంలో మరదలు కోమలతో కాపురం పెట్టాడు. సుమారు 9 నెలల పాటు బావ హితేంద్ర పటేల్ తో కోమల కాపురం చేసింది. హితేంద్రతో కాపురం చేసిన కోమల మళ్లీ ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

తప్పు చేశాను క్షమించు అని చెప్పిన భర్త.... ఓకే చెప్పిన భార్య

తప్పు చేశాను క్షమించు అని చెప్పిన భర్త.... ఓకే చెప్పిన భార్య

9 నెలల తరువాత హితేంద్ర పటేల్ అతని భార్య పునితను కలిశాడు. నేను నీ చెల్లి కోమలతో కలిసి పారిపోయి చాలా తప్పు చేశానని, నీకు ద్రోహం చేశానని, నన్ను క్షమించాలని హితేంద్ర పటేల్ అతని భార్య పునిత కాళ్లు పట్టుకున్నాడు. భర్త హితేంద్ర పటేట్ మీద ఉన్న ప్రేమతో పునిత కూడా అతన్ని క్షమించింది.

 భార్యకు వేరే ఇల్లు.... మరదలితో మరోకాపురం

భార్యకు వేరే ఇల్లు.... మరదలితో మరోకాపురం

భార్య పునితకు నచ్చచెప్పిన హితేంద్ర పటేల్ మరలు కోమలకు కూడా వేరే అద్దె ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు. ఇలా అక్క పునితతో ఓ ఇంటిలో, మరదలు కోమలతో మరో ఇంటిలో హితేంద్ర పటేల్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. కొంతకాలానికి హితేంద్ర పటేల్, అతని మరదలు కోమలకు గొడవలు మొదలైనాయి.

మరదలి హత్యకు భార్యతో స్కెచ్

మరదలి హత్యకు భార్యతో స్కెచ్

కొంతకాలం తరువాత నీకు నేను మోసం చేశానని, నీ చెల్లి కోమల మైకంలో పడిపోయి నీకు ద్రోహం చేశానని, మనం ఇద్దరం సంతోషంగా ఉండాలంటే నీ చెల్లిని చంపేద్దామని భర్త హితేంద్ర పటేల్ అతని భార్య పునితకు చెప్పాడు. కొంతకాలం పునిత కూడాఈ విషయం ఆలోచించింది. నా భర్త హితేంద్ర పటేల్ నాకు ఒక్కదానికి సొంతం కావాలంటే నా చెల్లి కోమల అడ్డు తొలగించుకోవడమే మంచిదని, నా కాపురంలో చిచ్చు రేపిన ఆమెను చంపేస్తే పీడపోతుందని పునిత ఆలోచించింది.

 చెల్లిని నమ్మించి పిలుచుకుని వెళ్లిన అక్క

చెల్లిని నమ్మించి పిలుచుకుని వెళ్లిన అక్క

2020 జనవరి నెలలో పునిత అతని చెల్లెలు కోమలకు ఫోన్ చేసి బయటకు వెళ్లాలని చెప్పింది. బిడ్డను బందువు ఇంటిలో వదిలిన కోమల ఆమె ఇంటి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి పునిత, ఆమె చెల్లి కోమలతో పాటు ఇద్దరి మొగుడు హితేంద్ర పటేల్ కూడా బయటకు వెళ్లారు. తరువాత సునంద పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్మదా నది సమీపంలోకి వెళ్లారు. ఆ సమయంలో మైకం వచ్చే స్ప్రై తీసుకున్న హితేంద్ర పటేల్, అతని భార్య పునిత కలిసి కోమల ముఖం మీద కొట్టారు.

Recommended Video

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
     ఇంతకాలానికి చిక్కిపోయారు

    ఇంతకాలానికి చిక్కిపోయారు

    స్ప్రే కొట్టడంతో కోమల మత్తులోకి జారుకుంది. అదే సమయంలో కోమల కాళ్లు, చేతులు కట్టేసి ఆమెను నర్మదా నది కాలువలోకి విసిరేయడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మూడు రోజుల తరువాత కోమల శవం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కోమలను హత్య చేసిన ఆమె అక్క పునిత, భర్త హితేంద్ర పటేట్ తరువాత ఇల్లు ఖాళీ చేసి అమియాపూర్ ప్రాంతంలో కాపురం పెట్టారు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం రాత్రి హితేంద్ర పటేల్, అతని భార్య పునితను అరెస్టు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+