Illegal affair: రౌడీషీటర్ గర్ల్ ఫ్రెండ్ తో ? జిమ్ లో చంపేసి డ్రమ్ లోనే బూడిద చేసి నిమజ్జనం!
ఇండోర్/ద్వారకా: మూతిమీద సక్రమంగా మీసాలు రాకముందే యువకుడు నేరాలు చెయ్యడం మొదలు పెట్టాడు. యువకుడి ఆగడాలు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు అతని పేరు రౌడీషీటర్ల జాబితాలోకి చేర్చారు. రౌడీషీటర్ గా ముద్రపడిన ఆ యువకుడు సొంతంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. సొంతంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తూ కొందరు యువకులను వెంట వేసుకుని అతను ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. రౌడీషీటర్, మరో యువకుడు ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆమె మీద అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో రౌడీషీటర్ ప్రధాన నిందితుడు.
రానురాను అతని ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులు అతన్ని పోలీసులు నగరం నుంచి బహిష్కరించారు. ఇదే సమయంలో తన ప్రియురాలితో తన స్నేహితుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రౌడీషీటర్ కు తెలిసింది. తాను నగర బహిష్కరణకు గురైతే తన స్నేహితుడే తన ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్నాడని రగిలిపోయాడు.
రౌడీషీటర్ అతని స్నేహితులతో కలిసి తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుకున్న యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. శవం కూడా చిక్కకుండా చెయ్యాలని డ్రమ్ లో శవం పెట్టి రెండు రోజుల పాటు నూనెలో కాల్చి బూడిద చేశారు. బూడిదను తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేసేసిన రౌడీషీటర్ అతని స్నేహితులు చేతులు దులుపుకోవడం కలకలం రేపింది.

మూతిమీద మీసాలు సక్రమంగా రాలేదు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ద్వారకాపూరి ప్రాంతంలో నారాయణ్ అలియాస్ నారి (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూతిమీద సక్రమంగా మీసాలు రాకముందే నారాయణ్ నేరాలు చెయ్యడం మొదలు పెట్టాడు. నారాయణ్ ఆగడాలు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు అతని పేరు రౌడీషీటర్ల జాబితాలోకి చేర్చారు.

సొంతంగా జిమ్ సెంటర్..... జలాయిగా తిరుగుడు
ద్వారకాపురి ప్రాంతంలో నారాయణ్ సొంతంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇండోర్ లో పేరుమోసిన రౌడీషీటర్ గా గుర్తింపు తెచ్చుకున్న నారాయణ్ రోజురోజుకు రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. సొంతంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తున్న నారాయణ్ కొందరు యువకులను వెంట వేసుకుని తిరుగుతూ అమాయకులను బెదిరిస్తూ ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టాడు.

మహిళను రేప్ చేసి చంపేశారు
నారాయణ్ కు భూపేంద్ర (21) అనే స్నేహితుడు ఉన్నాడు. గత ఏడాది నారాయణ్, భూపేంద్ర కలిసి ఓ మహిళను కిడ్నాప్ చేసి చంపేశారు. మహిళను హత్య చెయ్యకముందు ఆమె మీద అత్యాచారం చేశారని వెలుగు చూసింది. మహిళ కిడ్నాప్, హత్య, అత్యాచారం కేసులో నారాయణ్ ప్రధాన నిందితుడు కాగా నిందితుల జాబితాలో భూపేంద్ర పేరు కూడా ఉంది.

రౌడీషీటర్ నగర బహిష్కరణ.... రౌడిషీటర్ లవర్ తో?
రానురాను రౌడీషీటర్ నారాయణ్ ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసు అధికారులు అతన్ని ఇండోర్ నగరం నుంచి బహిష్కరించారు. ఇదే సమయంలో తన ప్రియురాలితో తన స్నేహితుడు భూపేంద్ర అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రౌడీషీటర్ నారాయణ్ కు తెలిసింది. తాను నగర బహిష్కరణకు గురైతే తన స్నేహితుడు భూపేంద్ర తన ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్నాడని, తనకు ద్రోహం చేస్తున్నాడని తెలుసుకున్న రౌడీషీటర్ నారాయణ్ రగిలిపోయాడు.

ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసి చంపేశారు
2021 నవంబర్ 25వ తేదీన భూపేంద్ర ఇండోర్ లోని సాయిబాబా నగర్ లోని అతని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత భూపేంద్రను ఫాలో అయిన కొందరు స్నేహితులు అతన్ని పక్కాప్లాన్ తో కిడ్నాప్ చేశారు. అదే రోజు రాత్రి ద్వారకాపురిలోని నారాయణ్ జిమ్ సెంటర్ మీదకు తీసుకెళ్లి బ్యాట్ లతో కొట్టి చంపేశారు.

డ్రమ్ లోనే శవాన్ని బూడిద చేసి నదిలో కలిపేశారు
భూపేంద్రను హత్య చేసిన తరువాత నారాయణ్ జిమ్ సెంటర్ టెర్రాస్ మీద డ్రమ్ లో అతని శవాన్ని పెట్టి నూనె పోసి రెండు రోజుల పాటు కాల్చేశారు. భూపేంద్ర శవం బూడిద అయ్యే వరకు డ్రమ్ లో నూనే పోస్తూ సన్నగా మంట పెట్టి కాల్చేశారు. తరువాత భూపేంద్ర శవం బూడిద కావడంతో ఆ బూడిదను ఇండోర్ కు 70 కిలోమీటర్త దూరంలోని నర్మదా నది దగ్గరకు తీసుకెళ్లి నిమజ్జనం చేసి చేతులు దులుపుకున్నారు.

మిస్సింగ్ కేసులో ట్విస్ట్
నవంబర్ 28వ తేదీన భూపేంద్ర కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు ద్వారకపూరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అప్పటి నుంచి భూపేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల రౌడీషీటర్ నారాయణ్ పీకలదాక తాగేసి భూపేంద్రను మేమే చంపేశామని అతని ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. భూపేంద్ర హత్య కేసులో రౌడీషీటర్ నారాయణ్, అతని స్నేహితులు క్రిష్ణకాంత్ వాగ్మారే, అనురాగ్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. భూపేంద్ర హత్యకు గురైన జిమ్ సెంటర్ టెర్రాస్ మీద ఫోరెన్సిక్ నిపుణులు, వేలిముద్రల నిపుణులతో పరిశీలించి ఆధారాలు సేకరించామని, కేసు విచారణలో ఉందని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ అధికారి సతీష్ ద్వివేది చెప్పారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలిపింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications