Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !
భోపాల్/షాదోల్: ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మాకు న్యాయం చెయ్యాలని పోలీస్ స్టేషన్ కు వస్తున్న వారి సమస్యలు తెలుసుకుని వారి కష్టాలను తీరుస్తున్నాడు. సవ్యంగా ఉద్యోగం చేసుకుంటున్న ఎస్ఐ జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న తనకే లేనిపోని సమస్యలు వచ్చిపడ్డాయని తెలుసుకుని ఆ ఎస్ఐ హడలిపోయాడు. తన భార్య ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఎస్ఐకి తెలిసింది. ఇదే విషయంలో ఎస్ఐ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. తరువాత ఎస్ఐకి మరో షాకింగ్ విషయం తెలిసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకులు ఆమెతో ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎస్ఐకి తెలిసింది. భార్యతో గొడవలు పడుతున్న ఎస్ఐ ఇటీవల ఆమెతో మాట్లాడటమే మానేశాడు. భార్య తీరుతో ఎస్ఐ సహనం కోల్పోయాడు. సర్వీస్ రివాల్వర్ తీసుకున్న ఎస్ఐ అతని భార్యను కాల్చి చంపేసి అదే రివాల్వర్ తో అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఎస్ఐ డెత్ నోట్ రాసిపెట్టాడని డీసీపీ మీడియాకు చెప్పారు.

సబ్ ఇన్స్ పెక్టర్ ఫ్యామిలీ
మధ్యప్రదేశ్ లోని షాదోల్ లో హీరా సింగ్ అనే సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) నివాసం ఉంటున్నాడు. హీరా సింగ్ కు కొన్ని సంవత్సరాల క్రితం రాణి అనే మహిళతో వివాహం జరిగింది. హీరా సింగ్, రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరా సింగ్ షాదోల్ లో భార్య రాణి, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

రేవా జిల్లాలో హీరా సింగ్ ఉద్యోగం
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో హీరా సింగ్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. హీరా సింగ్ భార్య రాణి, వారి ఇద్దరి పిల్లలు షాదోల్ లోనే నివాసం ఉంటున్నారు. వారంలో ఒకటి రెండుసార్లు భార్య, పిల్లలను చూసుకోవడానికి హీరా సింగ్ ఇంటికి వస్తున్నాడు. ఎస్ఐ హీరా సింగ్ అతని భార్య, పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవాడని తెలిసింది.

ఎస్ఐకి ఎదురు దెబ్బలు
ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న హీరా సింగ్ వ్యక్తి సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మాకు న్యాయం చెయ్యాలని పోలీస్ స్టేషన్ కు వస్తున్న వారి సమస్యలు తెలుసుకుంటున్న ఎస్ఐ హీరా సింగ్ వారి కష్టాలను తీరుస్తున్నాడు. సవ్యంగా ఉద్యోగం చేసుకుంటున్న ఎస్ఐ హీరా సింగ్ జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి.

భార్యకు ఇద్దరితో అక్రమ సంబంధం ఉందని ?
తాను బయట ఉద్యోగం చెయ్యడానికి వెలుతుంటే తన భార్య రాణి ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న ఎస్ఐ హీరా సింగ్ హడలిపోయాడు. ఇదే విషయంలో ఎస్ఐ హీరా సింగ్, రాణి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం బయటకు తెలిస్తే సాటి ఉద్యోగుల దగ్గర తన పరువు పోతుందని హీరా సింగ్ మౌనంగా ఉన్నాడని తెలిసింది.

ఎస్ఐ భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరు ప్రియులు ?
తన భార్య రాణి అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న హీరా సింగ్ ఆవేదన రగిలిపోతున్న సమయంలో అతనికి మరో షాకింగ్ విషయం తెలిసింది. తన భార్య రాణితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ ఇద్దరు యువకులు ఆమెతో ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎస్ఐ హీరా సింగ్ కి తెలిసింది.

భార్యను కాల్చి చంపేసి ఎస్ఐ ఆత్మహత్య
భార్య రాణి తీరుతో రగిలిపోయిన హీరా సింగ్ ఇటీవల కాలంలో ఇంటికి సక్రమంగా రావడం కూడా మానేశాడని తెలిసింది. చివరికి సోమవారం ఎస్ఐ హీరా సింగ్ నేరుగా ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య రాణితో గొడవలు పడుతున్న ఎస్ఐ హీరా సింగ్ సహనం కోల్పోయాడు. సర్వీస్ రివాల్వర్ తీసుకున్న ఎస్ఐ హీరా సింగ్ అతని భార్య రాణిని కాల్చి చంపేసి అదే రివాల్వర్ తో అతను ఇంట్లోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

డెత్ నోట్ రాసి పెట్టిన ఎస్ఐ
ఎస్ఐ హీరా సింగ్ అతని భార్య రాణిని చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో పోలీసు అధికారులు అక్కడికి పరుగు తీశారు. ఎస్ఐ హీరా సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టాడని డీసీపీ సోనాలి గుప్తా మీడియాకు చెప్పారు. తన భార్య ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆ ఇద్దరు యువకులు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎస్ఐ హీరా సింగ్ డెత్ నోట్ లో రాసి పెట్టాడని డీసీపీ సోనాలి గుప్తా మీడియాకు చెప్పారు.

డెత్ నోట్ లో కేటుగాళ్ల పేర్లు ఎస్ఐ రాయలేదు
అయితే భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరి యువకుల పేర్లు ఎస్ఐ హీరా సింగ్ డెత్ నోట్ లో రాయలేదని డీసీపీ సోనాలి గుప్తా అంటున్నారు. కొంతకాలంగా ఎస్ఐ హీరా సింగ్ అతని భార్య రాణితో మాట్లాడటం పూర్తిగా మానేశాడని,వారు నివాసం ఉంటున్న ఇంటి యజమానికి ఫోన్ చేసి అతని పిల్లలతో మాట్లాడుతున్నాడని డీసీపీ సోనాలి గుప్తా మీడియాకు చెప్పారు.

కలకలం రేపిన ఎస్ఐ ఫ్యామిలీ స్టోరి
సర్వీస్ రివాల్వర్ తో భార్యను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. ఎస్ఐ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారి కోసం మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు గాలిస్తున్నారు. ఎస్ఐ హీరా సింగ్ కు చాలా సున్నితమైన మనస్తత్వం ఉందని, ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేదని ఆయనతో పని చేస్తున్న సాటి ఉద్యోగులు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications