Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తను చంపేసి ప్రియుడితో ఎస్కేప్, ఫామ్ హౌస్ లో ఎంజాయ్, ఫోన్ కాల్ ?

చెన్నై/కొచ్చి: కాలేజ్ కుర్రాడి వ్యామోహంలో పడిన పిల్లల తల్లి పగలు, రాత్రి అని తేడా లేకుండా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. పగలు ప్రియుడు, రాత్రి మొగుడు అంటూ రెచ్చిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు రానురాను ఎగుటు అయ్యాడు. మొగుడు వద్దు ప్రియుడే ముద్దు అని విచ్చలవిడిగా తయారైయ్యింది. మంచిరోజు చూసి మొగుడిని చంపేసి ఇంటి వెనుక పూడ్చేసి ప్రియుడితో పారిపోయి పక్క రాష్ట్రంలోని ఓ ఫామ్ హౌస్ లో మకాం వేసి కామవాంఛ తీర్చుకునింది. గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో ఆంటీ, ఆమె ప్రియుడు ఒకేఒక్క ఫోన్ కాల్ తో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

 కామంతో కలర్ తెలీలేదు

కామంతో కలర్ తెలీలేదు

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రంవాడి సమీపంలోని పూవరసం కుప్పం ప్రాంతంలో లియోబాల్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లియోపోల్డ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఎర్రగా, బుర్రగా ఉండే సుచిత్రా మేరీ అలియాస్ సుజిత మేరి (32) అనే యువతి ప్రేమలోపడ్డాడు. 2013లో లియోబాల్, సుచిత్రా మేరీ ప్రేమించుకుని తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి సమయంలో తన ప్రియుడు నల్లగా ఉన్న విషయం కామంతో ఉన్న మేరీకి ఏమాత్రం కనపడలేదు. లియో, సుచిత్రా మేరీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 చూపులతోనే రెచ్చగొట్టింది

చూపులతోనే రెచ్చగొట్టింది

లియో చూడటానికి నల్లగా ఉంటాడు. సుచిత్రా మేరీ ఎర్రగా, బుర్రగా, బలంగా ఉంటోంది. లియో, సుచిత్రా చూడటానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలాగా ఇద్దరు ఎక్కడ కలిసిన టక్కున గుర్తుపట్టేలాగా ఉంటారు. తెల్లతోలు వేసుకున్న సుచిత్రా మేరీకి చాలా టెక్కు ఎక్కవే అని ఆమెను దగ్గర నుంచి చూసినవాళ్లు అంటుంటారు. మేరీ ప్రతిరోజు టిప్పుటాప్ గా రెడీ అవుతూ ఫోజులు కొడుతూ చుట్టుపక్కల మగాళ్లను చూపులతోనే రెచ్చగొట్టింది.

 ఆ ఒక్కపొరపాటు చేసిన భర్త

ఆ ఒక్కపొరపాటు చేసిన భర్త

లియో, సుచిత్రా దంపతులు విల్లుపురం నుంచి చెన్నై చేరుకుని అక్కడే కాపురం ఉండేవాళ్లు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంతో డ్రైవర్ గా పని చేస్తున్న లియో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. పిల్లలకు కూడా సక్రమంగా భోజనం పెట్టలేని పరిస్థితి ఎదురు కావడంతో 8 నెలల క్రితం లియో భార్య సుచిత్రా, ఇద్దరు పిల్లలను పిలుచుకుని వెళ్లి సొంతఊర్లు పూవరస కుప్పంలో వదిలిపెట్టాడు. లియో మళ్లీ చెన్నై చేరుకుని పని చేస్తూ డబ్బులు సంపాధిస్తున్నాడు.

 మస్త్ మసాలా దోసె

మస్త్ మసాలా దోసె

ఊర్లో ఉంటున్న సుచిత్రాకు అంతకు ముందే భర్త లియోకు పరిచయం ఉంటూ కాలేజ్ లో చదువుతున్న రాకీ అలియాస్ రాధాక్రిష్ణన్ (20) అనే యువకుడితో పరిచయం అయ్యింది. రాకీ స్టైల్ కు పిల్లల తల్లి సుచిత్రా మేరీ పడిపోయింది. రాకీకి సైగలు చేసిన సుచిత్రా అతన్ని వలలో వేసుకుంది. సుచిత్రా మొగుడు లియో చెన్నైలో ఉంటే ఊర్లో ఆమెకు పక్కన ప్రియుడు రాకీ రెఢీ అయ్యాడు. ఆ రోజు బెడ్ రూమ్ లో భార్య సుచిత్రా మేరీ, ప్రియుడు రాకీతో కలిసి ఎంజాయ్ చేస్తూ భర్త లియోకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. ఆ రోజు భార్య సుచిత్రా, ఆమె ప్రియుడు రాకీకి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.

 ప్రియుడితో ఎర్రతోలు ఆంటీ సూపర్ స్కెచ్

ప్రియుడితో ఎర్రతోలు ఆంటీ సూపర్ స్కెచ్

ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి మద్యం సేవించిన లియో ఇంటికి వెళ్లి గదిలో నిద్రపోయాడు. తన భర్త బతికుంటే తాను ప్రియుడితో సరసాలు ఆడలేనని డిసైడ్ అయిన సుచిత్రా ప్రియుడు రాకీని ఇంటికి పిలిపించింది. గాఢంగా నిద్రపోతున్న లియోను పట్టుకుని అతని గొంతుకోసేసి ఇనుపరాడ్ తో తలమీద దాడి చేసి చంపేశారు. ఇంటి వెనుక గోతి తీసిన సుచిత్రా, ఆమె ప్రియుడు లియో శవాన్ని పూడ్చేసి ఏమీ తెలియని అమాయకుల్లా సైలెంట్ అయిపోయారు.

 మామ దెబ్బకు దూలతీరింది

మామ దెబ్బకు దూలతీరింది

లియో కనపడటం లేదని అతని తండ్రి సహాయం పోలీసు కేసు పెట్టడంతో భయపడిన సుచిత్రా, ప్రియుడు రాకీ అలియాస్ రాధాక్రిష్ణన్ తో కలిసి ఫిబ్రవరి 21వ తేదీన ఇంటి నుంచి చెక్కేసింది. పోలీసులు ఇంటికి చేరుకుని వెనుక భాగంలోని పెరటలో గోతి తీసి పరిశీలించగా లియో శవం బయటపడటంతో షాక్ అయ్యారు. లియో శవం కొంత వరకు కుళ్లిపోవడం, అతని మెడ, తలకు తీవ్రగాయాలైన విషయం గమనించిన పోలీసులు ఆ శావాన్ని పోస్టుమార్టుం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంలో లియో హత్యకు గురైనాడనే విషయం బయటపడింది.

 పక్క రాష్ట్రంలో మస్త్ మజా

పక్క రాష్ట్రంలో మస్త్ మజా

తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల బిజీలో తమను ఎవ్వరూ పట్టుకోలేని బావించిన సుచిత్రా మేరి, ప్రియుడు రాకీ అలియాస్ రాధాక్రిష్ణన్ తో కలిసి కేరళలోని ఓ ఫామ్ హౌస్ లో కాపురం పెట్టేసింది. మా కేసు విషయం ఏమైయ్యింది ?, మాకు డబ్బులు అవసరంగా ఉంది అంటూ ప్రియుడు అతని స్నేహితుడికి ఫోన్ చేశాడు. నెల రోజుల నుంచి వీళ్ల కోసం వెతుతున్న తమిళనాడు పోలీసులు అదే సమయంలో ప్రియుడి మొబైల్ ఫోన్ కాల్ నెట్ వర్క్ ఆధారంగా కేరళ చేరుకుని ఇద్దర్నీ పట్టుకుని తమిళనాడు తీసుకొచ్చారు.

 తప్పు మొగుడిదే సార్ ?

తప్పు మొగుడిదే సార్ ?

విక్రంవాడిలో లియో, రాధాక్రిష్ణన్, మరో ముగ్గురు స్నేహితులు కలిసినప్పుడు మద్యం సేవించే వాళ్లని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. లియో తన ఇంటికి రాధాక్రిష్ణన్ ను పిలిపించుకుని మద్యం సేవించేవాడని, అదే సమయంలో మేరీ ఆ కాలేజ్ యువకుడికి దగ్గర కావాలని ప్లాన్ వేసిందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద స్నేహితుడిని ఇంటికి పిలిపించుకున్న పాపానికి లియో భార్య మేరీ, ఆమె ప్రియుడి చేతిలోనే హత్యకు గురైనాడని పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+