Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !
పాట్నా/బీహార్: భర్తతో కాపురం చేస్తున్న భార్యకు అతని ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న భర్త కోసం అతని ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో భార్య అతనితో తగులుకునింది. అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న భర్త కోసం పోలీసులు నిఘా వేశారు. రహస్యంగా వచ్చి భార్యతో కాపురం చేస్తున్న భర్త తరువాత మళ్లీ మాయం అయిపోతున్నాడు. ఇదే సమయంలో భర్త ఫ్రెండ్ నిత్యం అందుబాటులో ఉండటంతో అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఎంజాయ్ చేసింది.
ప్రియుడి వ్యామోహంలో పడిపోయిన భార్య ఆమెను భర్త హత్యకు స్కెచ్ వేసింది. నివాసం ఉంటున్న ఫ్లాట్ లో భర్తను అతని భార్య, ఆమె ప్రియుడు, సోదరి, ఆమె భర్తతో కలిసి దారుణంగా చంపేశారు. భర్త శవాన్ని ముక్కలుగా నరికేసిన తరువాత ఆ ముక్కలు కరిగించడానికి రసాయనాలు ఉపయోగించారు. కెమికల్స్ మిక్స్ చెయ్యడంలో తేడాలు రావడంతో పెద్ద పేలుడు సంభవించింది. ప్లాట్ లో పేలుడు జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ఫ్లాట్ లో పరిశీలించగా మనిషిని నరికేసి ముక్కలు ముక్కలు చేశారని, ఆ పేలుడురు మాంసం ముక్కలు ఇల్లు మొత్తం ఎగిరిపడ్డాయని తెలుసుకుని షాక్ అయ్యారు.

లిక్కర్ వ్యాపారి
బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్ వ్యాపారం చేసేవాడు. బీహార్ లో మద్యపాన నిషేదం అమలు చేసిన తరువాత కూడా రాకేష్ అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న రాకేష్ ను పోలీసులు అనేకసార్లు అరెస్టు చేశారు.

భర్త ఫ్రెండ్ తో భార్య రొమాన్స్
బెయిల్ మీద బయటకు వచ్చిన రాకేష్ మళ్లీ అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. భర్త రాకేష్ తో కాపురం చేస్తున్న అతని భార్య రాధాకు భర్త ఫ్రెండ్ సుభాష్ పరిచయం అయ్యాడు. అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న భర్త రాకేష్ కోసం అతని ఫ్రెండ్ సుభాష్ ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో భార్య రాధా అతన్ని తగులుకుంది.

రహస్యంగా వస్తున్న భర్త........ డైలీ వస్తున్న ప్రియుడు
అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న భర్త రాకేష్ కోసం పోలీసులు నిఘా వేశారు. రహస్యంగా వచ్చి భార్య రాధాతో కాపురం చేస్తున్న ఆమె భర్త రాకేష్ తరువాత పోలీసులు పట్టుకుంటారని భయంతో మళ్లీ మాయం అయిపోతున్నాడు. ఇదే సమయంలో భర్త రాకేష్ ఫ్రెండ్ సుభాష్ డైలీ అందుబాటులో ఉండటంతో అతనితో రాధా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది.

ప్రియుడి వ్యామోహంలో భర్త హత్యకు స్కెచ్
ప్రియుడు సుభాష్ వ్యామోహంలో పడిపోయిన రాకేష్ భార్య రాధా ఆమె భర్త హత్యకు స్కెచ్ వేసింది. తన భర్త రాకేష్ ను చంపేసి అతని ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోవాలని రాధా ఆమె ప్రియుడు సుభాష్ కు చెప్పింది. భర్త రాకేష్ హత్యకు సహాయం చెయ్యాలని రాధా ఆమె సోదరి కృష్ణప్రియా, ఆమె భర్తకు చెప్పింది. రాధా, ఆమె ప్రియుడు సుభాష్, రాధా సోదరి కృష్ణప్రియా, ఆమె భర్త రాకేష్ ను చంపేయాలని డిసైడ్ అయ్యారు.

ముక్కలుగా నరికేసి కెమికల్స్ తో ?
రాకేష్ ను అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ లో అతని భార్య రాధా, ఆమె ప్రియుడు సుభాష్, సోదరి సోదరి కృష్ణప్రియా, ఆమె భర్త కలిసి దారుణంగా చంపేశారు. రాకేష్ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. రాకేష్ శవాన్ని ముక్కలుగా నరికేసిన తరువాత ఆ ముక్కలు కరిగించడానికి రసాయనాలు (కెమికల్స్) ఉపయోగించారు. కెమికల్స్ మిక్స్ చెయ్యడంలో తేడాలు రావడంతో రాధా నివాసం ఉంటన్న ఫ్లాట్ లో పెద్ద పేలుడు సంభవించింది.

పోలీసుల ఎంట్రీతో కలకలం
రాకేష్ ప్లాట్ లో పేలుడు జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లిన సమయంలో అక్కడ రాధా, ఆమె ప్రియుడు సుభాష్, సోదరి సోదరి కృష్ణప్రియా, ఆమె భర్త అక్కడే ఉన్నారు. పోలీసులు వెళ్లి ఫ్లాట్ లో పరిశీలించగా రాకేష్ ను నరికేసి ముక్కలు ముక్కలు చేశారని, ఆ పేలుడుతో మాంసం ముక్కలు ఇల్లు మొత్తం ఎగిరిపడ్డాయని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.
Recommended Video

మా వదిన, ఆమె ప్రియుడు చంపేశారు
ఇదే సమయంలో రాకేష్ ను అతని భార్య రాధా, ప్రియుడు సుభాష్ హత్య చేశారని రాకేష్ సోదరుడు దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాధా, సుభాష్ అక్రమ సంబంధం అందరికి తెలుసని, తన సోదరుడు రాకేష్ అనేకసార్లు మా వదిన రాధాకు వార్నింగ్ ఇచ్చాడని, అందుకే అతన్ని అందరూ కలిసి చంపేశారని అతని సోదరుడు దినేష్ ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారి హరేంద్ర తివారీ స్థానిక మీడియాకు చెప్పారు. రాకేష్ హత్య కేసులో అతని భార్య రాధా, ఆమె ప్రియుడు సుభాష్, సోదరి సోదరి కృష్ణప్రియా, ఆమె భర్తను అరెస్టు చేశామని పోలీసు అధికారి హరేంద్ర తివారీ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications