Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: రౌడీగారి పెళ్లామ్ లవ్ స్టోరీ, భర్త ఎన్ కౌంటర్, శిష్యుడితో ఎంజాయ్, ముగ్గురు బాయ్స్ !

చెన్నై/ కడలూరు/ మదురై: చిన్న వయసులోనే నేరాలు చెయ్యడం అలవాటు చేసుకున్న యువకుడు అతనికంటూ రౌడీసామ్రాజ్యంలో లో గుర్తింపు తెచ్చుకున్నాడు. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ లు చేసిన రౌడీ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. హత్య కేసులో పోలీసులు ఆ రౌడీని అరెస్టు చేశారు. రౌడీని విచారణ చేసిన తరువాత అతన్ని కోర్టు ముందు హాజరుపరచడానికి జీపులో బయలుదేరారు. ఆ సమయంలో ఎస్ఐ గొంతు కోసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రౌడీని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారు. హత్యకు గురైన రౌడీషీటర్ భార్య ఇప్పుడు భర్త శిష్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. రౌడీషీటర్ బంధువులు వార్నింగ్ ఇవ్వడంతో రౌడీగారి పెళ్లామ్ సైలెంట్ అయిపోయి ప్రియుడిని దూరం పెట్టింది. తన గురువు భార్య తనకు పడక సుఖం ఇవ్వడం మానేసిందని రగలిపోయిన ప్రియుడు రౌడీషీటర్ భార్యను నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేశాడు. రౌడీషీటర్ భార్యను హత్య చెయ్యడానికి ఆమె ప్రియుడు థ్రిల్లర్ సినిమా టైపులో ముగ్గురు మైనర్లను రంగంలోకి దింపడం కలకలం రేపింది.

రౌడీషీటర్ లవ్ మ్యారేజ్

రౌడీషీటర్ లవ్ మ్యారేజ్

తమిళనాడులోని కడలూరు జిల్లా తిరుపతి పుల్లియూర్ సమీపంలోని కుప్పంగుళం ప్రాంతంలో కృష్ణన్ అలియాస్ కృష్ణ (34) నివాసం ఉంటున్నాడు. కృష్ణన్ చిన్న వయసులోనే నేరాలు చెయ్యడం అలవాటు చేసుకున్నాడు, కృష్ణన్ అతనికంటూ రౌడీగ్యాంగ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ లు చేసిన రౌడీ కృష్ణన్ గాంధీమతి (30) అనే యువతిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకున్నాడు.

రౌడీషీటర్ ను దారుణంగా చంపేశాడు

రౌడీషీటర్ ను దారుణంగా చంపేశాడు

గాంధీమతిని వివాహం చేసుకున్న కృష్ణన్ కూతురు, కొడుక్కి తండ్రి అయ్యాడు. భార్య గాంధీమతి, ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణన్ సంతోషంగానే ఉండేవాడు. ఇదే సమయంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వీరమణి అలియాస్ వీరా అనే రౌడీషీటర్ ను కృష్ణన్ అతని అనుచరులు దారుణంగా నరికి చంపేశారు.

రౌడీషీటర్ ఎన్ కౌంటర్

రౌడీషీటర్ ఎన్ కౌంటర్


వీరా హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న కృష్ణన్ పట్టుకోవడం కోసం స్థానిక పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. తరువాత పక్కాప్లాన్ తో రౌడీషీటర్ కృష్ణన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా రౌడీషీటర్ కృష్ణన్ ను విచారణ చేసిన తరువాత అతన్ని కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులు జీపులో బయలుదేరారు. ఆ సమయంలో ఎస్కార్టుగా వెలుతున్న ఎస్ఐ గొంతు కోసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రౌడీషీటర్ కృష్ణన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారు.

రౌడీగారి పెళ్లామ్ లవ్ స్టోరీ

రౌడీగారి పెళ్లామ్ లవ్ స్టోరీ


రౌడీషీటర్ కృష్ణన్ కు అనేక మంది శిష్యులు ఉన్నారు. రౌడీషీటర్ కృష్ణన్ కు ప్రధాన అనుచరుడిగా అరవింద్ (23) అనే యువకుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణన్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన తరువాత అతని గ్యాంగ్ ను అరవింద్ చూసుకుంటున్నాడు. ఇదే సమయంలో ఎన్ కౌంటర్ లో చనిపోయిన గురువు కృష్ణన్ భార్య గాంధీమతితో అరవింద్ చనువుగా ఉన్నాడు. ఇదే సమయంలో భర్త కృష్ణన్ చనిపోవడంతో అతని శిష్యుడు అరవింద్ కు గాంధీమతి దాసోహం అయ్యింది.

గురువు భార్యతో అక్రమ సంబంధం

గురువు భార్యతో అక్రమ సంబంధం

నేరాలు, సెటిల్ మెంట్ లు, కబ్జాలు, మాముళ్లు, రౌడీయిజం ఎలా చెయ్యాలి అని నేర్పించి ఎన్ కౌంటర్ లో చనిపోయిన గురువు కృష్ణన్ భార్య గాంధీమతితో అరవింద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తనకంటే వయసులో 7 సంవత్సరాలు పెద్దది, ఇద్దరు పిల్లల తల్లి అయిన గాంధీమతితో ఆమె భర్త శిష్యుడు అరవింద్ పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

 వార్నింగ్ ఇచ్చిన రౌడీషీటర్ ఫ్యామిలీ

వార్నింగ్ ఇచ్చిన రౌడీషీటర్ ఫ్యామిలీ


అరవింద్ అతని గురువు కృష్ణన్ భార్య గాంధీమతి ఇంటికి ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. భర్త లేని గాంధీమతి ఇంటికి అరవింద్ పదేపదే వెళ్లి వస్తున్న విషయం కృష్ణన్ కుటుంబ సభ్యులు గమనించారు. నీ మొగుడు పేరు మోసిన రౌడీషీటర్, అతను ఎన్ కౌంటర్ లో చనిపోతే నువ్వు అతని శిష్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుని పరువు తీస్తున్నావని, నువ్వు పద్దతి మార్చుకోవాలని గాంధీమతికి వార్నింగ్ ఇచ్చారు.

ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు

ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు


బంధువులు, కుటుంబ సభ్యులు, భర్త శిష్యులు కొందరు వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన గాంధీమతి ఆమె ప్రియుడు అరవింద్ ను దూరం పెట్టింది. నువ్వునాతో ఇకముందు మాట్లాడకూడదని, మా ఇంటికి రాకూడదని గాంధీమతి తేల్చి చెప్పింది. తన ప్రియురాలు గాంధీమతి దూరం అయ్యిందని, తనతోకాకుండా మరో యువకుడిని ఆమె సెట్ చేసుకుంటుందని అరవింద్ రగలిపోయాడు.

రంగంలోకి దిగిన ముగ్గురు మైనర్లు

రంగంలోకి దిగిన ముగ్గురు మైనర్లు

తనకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదని, గాంధీమతిని చంపేస్తే పీడపోతుందని అరవింద్ డిసైడ్ అయ్యాడు. గాంధీమతిని హత్య చెయ్యడానికి స్కెచ్ వేసిన ఆమె ప్రియుడు అరవింద్ ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ముగ్గురు మైనర్లను రంగంలోకి దింపాడు. రాత్రి షాపు నుంచి ఇంటికి వెలుతున్న గాంధీమతితో ముగ్గరు అబ్బాయిలు మాట్లాడారు.

స్పాట్ లో చంపేసిన ప్రియుడు

స్పాట్ లో చంపేసిన ప్రియుడు


గాంధీమతితో మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడిచి వెలుతున్నారు. ఆ సమయంలో బైక్ లో వచ్చిన అరవింద్ అతని ప్రియురాలు గాంధీమతిని అడ్డగించారు. ఆ సమయంలో ప్రియుడు అరవింద్ తో పాటు ముగ్గురు మైనర్లు కత్తులు తీసుకుని గాంధీమతిని నడిరోడ్డులో దారుణంగా పొడిచి స్పాట్ లో చంపేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

హత్య కేసులో ముగ్గురు మైనర్లు

హత్య కేసులో ముగ్గురు మైనర్లు

రౌడీషీటర్ కృష్ణన్ భార్య గాంధీమతి హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు గాంధీమతిని హత్య చేసిన ఆమె ప్రియుడితో పాటు ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. గాంధీమతి హత్య కేసులో 16, 17 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు అబ్బాయిలు ఉండటం కలకలం రేపింది. అరవింద్ ను కోర్టు ముందు హాజరుపరిచామని, మిగిలిన ముగ్గురు మైనర్లను బాలనేరస్తుల కారాగారానికి పంపించామని కడలూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+