Techie: పెళ్లైన నెల రోజులకే టెక్కీని చంపించిన కన్నింగ్ పెళ్లామ్, ప్రియుడితో స్కెచ్, లైఫ్ !

చెన్నై/ తుత్తుకూడి: సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడికి అతని కుటుంబ సభ్యులు ఓ అమ్మాయిని చూశారు. టెక్కీ వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే టెక్కీతో అతని భార్య సంతోషంగా కాపురం చెయ్యలేదు. ఓ రోజు మనం బీచ్ కు వెళ్లి వద్దామని భార్య టెక్కీకి చెప్పింది. భార్య మనసు మార్చుకుంటుందని టెక్కీ సంతోషంగా ఆమెను బయటకు పిలుచుకుని వెళ్లాడు. బీచ్ లో టెక్కీ దంపతులు చాలా ఉల్లాసంగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. తరువాత ఓ వ్యక్తి కొడవలితో టెక్కీని దారుణంగా నరికేశాడు. తన మెడలో తాళిబొట్టు లాక్కొన్న దొంగ నా భర్తను కొడవలితో నరికేశాడని భార్య బోరున విలపించింది. బీచ్ లో ఉన్న వాళ్లు, పోలీసులు టెక్కీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై టెక్కీ ప్రాణం పోయింది. పోలీసుల విచారణలో, సీసీటీవీ కెమెరాల్లో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి జరిగిన నెల రోజులకే టెక్కీ హత్య వెనుక చాలా కథ ఉందని వెలుగు చూసింది.

 టెక్కీ పెళ్లి కోసం చర్చలు

టెక్కీ పెళ్లి కోసం చర్చలు

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో కధివరన్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కధివరన్ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తుత్తకూడి జిల్లాలోనే నివాసం ఉంటున్న వినోధిని అలియాస్ అనిత (26) అనే యువతితో టెక్కీ కధివరన్ వివాహం జరిపించాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 గ్రాండ్ గా పెళ్లి జరిగింది

గ్రాండ్ గా పెళ్లి జరిగింది

2018 సెప్టెంబర్ 12వ తేదీన తుత్తుకూడిలో టెక్కీ కధివరన్, వినోధినిల వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. టెక్కీ కధివరన్ ను వివాహం చేసుకున్న వినోధిని అతనితో సంతోషంగా కాపురం చెయ్యకుండా అంటిముట్టనట్లు వ్యవహరించింది. అయితే ఆ విషయా టెక్కీ కధివరన్ పెద్దగా పట్టించుకోలేదు.

 బీచ్ కు వెలుదామని చెప్పిన భార్య

బీచ్ కు వెలుదామని చెప్పిన భార్య

వివాహం జరిగిన తరువాత టెక్కీ కధివరన్ అతని భార్య వినోదినితో కలిసి చెన్నై చేరుకుని ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు.వారం రోజుల తరువాత వినోధిని ఆమె భర్త కధివరన్ తో క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది. 2018 అక్టోబర్ 12వ తేదీన వినోధిని ఆమె భర్త కధివరన్ కు మనం బీచ్ కు వెలుదామని చెప్పింది.

 బీచ్ లో టెక్కీని నరికేసి ఎస్కేప్

బీచ్ లో టెక్కీని నరికేసి ఎస్కేప్

తన భార్య వినోధిని మనసు మార్చుకుంటుందని టెక్కీ కధివరన్ చాలా సంతోషంగా ఆమెను చెన్నైలోని మెరీనా బీచ్ కు పిలుచుకుని వెళ్లాడు. బీచ్ లో టెక్కీ కధివరన్ అతని భార్య వినోధిని చాలా ఉల్లాసంగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. తరువాత ఓ వ్యక్తి కొడవలితో టెక్కీ కధివరన్ ను దారుణంగా నరికేశాడు. తన మెడలో తాళిబొట్టు లాక్కొన్న దొంగ నా భర్త కధివరన్ ను కొడవలితో నరికేశాడని అతని భార్య వినోధిని గట్టిగా కేకలు వేసింది.

 సీసీటీవీ కెమెరాల్లో మ్యాటర్ మొత్తం ?

సీసీటీవీ కెమెరాల్లో మ్యాటర్ మొత్తం ?

బీచ్ లో ఉన్న వాళ్లు, పోలీసులు టెక్కీ కధివరన్ ను వెంటనే చెన్నైలోని అడయార్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై టెక్కీ కధివరన్ ప్రాణాలు పోయాయి. పోలీసులు బీచ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించడంతో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

 ప్రియుడితో కలిసి నాటకాలు ఆడిన భార్య

ప్రియుడితో కలిసి నాటకాలు ఆడిన భార్య

బీచ్ లో టెక్కీ కధివరన్ మీద కొడవలితో దాడి చేసి హత్య చేసిన యువకుడిని అథోణి (24) అని పోలీసులు గుర్తించారు. టెక్కీ కధివరన్ హత్యకు గురికాకముందు అతని భార్య వినోధిని ఓ యువకుడితో బీచ్ లో మాట్లాడుతున్న విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బీచ్ లో వినోధిని ఆమె మెడలో ఉన్న తాళి ఓ యువకుడికి ఇచ్చి పారిపోవాలని చెప్పిందని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది,

 కులాలు, మతాలు వేరు

కులాలు, మతాలు వేరు

కొన్ని సంవత్సరాల క్రితం అంథోణి, వినోధిని ప్రేమించుకున్నారని, ఇద్దరి కులాలు, మతాలు వేరుకావడంతో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, తరువాత వినోధినిని టెక్కీ కధివరన్ కు ఇచ్చి వివాహం చేశారని పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు వినోధిని, ఆంథోణిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.

 భార్య, ప్రియుడికి యావజ్జీవ శిక్ష

భార్య, ప్రియుడికి యావజ్జీవ శిక్ష

పోలీసులు సీసీటీవీ క్లిప్పింగ్స్, వినోధిని, ఆంథోణి మొబైల్ ఫోన్ కాల్ డేటాను మద్రాసు ఫస్ట్ సెషన్స్ కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి తంగ మారియప్పన్ ఈ రోజు టెక్కీ కధివరన్ భార్య వినోధిని, ఆమె ప్రియుడు ఆంథోణికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వివాహం జరిగిన నెల రోజులకే భర్త కధివరన్ ను ప్రియుడు ఆంథోణితో దారుణంగా హత్య చేయించిన వినోధిని జైలుపాలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+