కరోనాకు అల్లోపతి వేస్ట్, స్టుపిడ్ సైన్స్ -రాందేవ్‌కు డాక్టర్ల లీగల్ నోటీసులు -పతంజలి ఫైర్ -కేంద్రం గప్‌చుప్
''అల్లోపతి అంటేనే పెద్ద స్టుపిడ్(తెలివి తక్కువ) సైన్స్. కరోనా మహమ్మారి విషయంలో అది ఇంకా బాగా తేలిపోయింది. కొవిడ్ వ్యాధి చికిత్స కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇప్పటిదాకా సూచించిన క్లోరోక్వీన్, ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివీర్, ఫవిఫ్లు ఇంకా ఇతర యాంటీ బయోటిక్ ఫ్లూయిడ్స్, స్టెరాయిడ్స్, విధానాలు, డ్రగ్స్ అన్నీ విఫలమయ్యాయి.
Recommended Video
అల్లోపతి వల్లే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు..'' అంటూ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం కొనసాగుతున్నది. గతంలో అల్లోపతి డాక్టర్లను హంతకులుగానూ అభివర్ణించిన రాందేవ్ పై ఇండియన్ మెడికల్అసోసియేషన్ (ఐఎంఏ), ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సహా పలు సంఘాల డాక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
I am 24,posted in ICU,with 8-10 new mucormycosis cases daily,heavy viral load,risking our lives to save patients & then we see the comments like Baba Ramdev,so much depressing.
— Medicogirl (@nikita__panwar) May 22, 2021
We are not money minded like you baba,
We are paid only 12k/month
Have some shame!#ArrestQuackRamdev pic.twitter.com/fYUN7yyhzH

రాందేవ్‌కు లీగల్ నోటీసులు..
కరోనాకు చికిత్స అందిస్తోన్న డాక్టర్లను, అల్లోపతి వైద్యాన్ని తీవ్రంగా నిందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాకు ఐఎంఏ లీగల్ నోటీసులు పంపింది. అదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖకు కూడా ఐఎంఏ ఘాటు లేఖ రాసింది.
అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా రాందేవ్ మాట్లాడారని పేర్కొన్న ఐఎంఏ.. యోగా గురుపై అపిడమిక్ డిసీజెస్ యాక్టుల ప్రకారం కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే, దేశంలో అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని డాక్టర్ల సంఘం కేంద్రాన్ని కోరింది. యువ డాక్టర్లు పెద్ద సంఖ్యలో రాందేవ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పతంజలి డబ్బు కక్కుర్తి..
అల్లోపతి వైద్యాన్ని, డాక్టర్లను నిందించడం ద్వారా రాందేవ్.. తన పతంజలి సంస్థలో తయారైన చట్టవిరుద్ధ, ఇంకా ఆమోదం పొందని మందులను విక్రయించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఐఎంఏ ఆరోపించింది. తన వ్యాపారం కోసం రాందేవ్ లాంటి వాళ్లు సైన్సును నిందించడం ప్రమాదకర ధోరణి అని ఐఎంఏ అభిప్రాయపడింది. స్వతహాగా అల్లోపతి డాక్టర్ అయిన హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ, రాందేవ్ లాంటి వాళ్లను ఉపేక్షించడం తగదని, కేంద్ర సర్కారు వెంటనే ఆయనపై చర్యలకు దిగకుంటే, రాబోయే రోజుల్లో న్యాయపోరాటాలతోపాటు ప్రజా ఉద్యమాలనూ నిర్మిస్తామని ఐఎంఏ హెచ్చరించింది. కాగా,

అల్లోపతిని తిట్టలేదు, కలిసి చేద్దాం..
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పంపిన లీగల్ నోటీసులు, బాబా రాందేవ్ పై వెల్లువెత్తుతోన్న విమర్శలపై పతంజలి యోగ్ పీఠ్ ట్రస్ట్ ఆదివారం ఘాటుగా బదులిచ్చింది. సైన్సునుగానీ, అల్లోపతి వైద్య విధానాన్నిగానీ రాందేవ్ కించపర్చలేదని, వాట్సాప్ ద్వారా తనకు ఫార్వర్డ్ అయిన ఓ మెసేజ్ ను మాత్రమే ఆయన చదివి వినిపించారేతప్ప నేరుగా డాక్టర్లను ఏమీ అనలేదని, అల్లోపతిపై రాందేవ్ కుగానీ, పతంజలి సంస్థకుగానీ వ్యతిరేకత లేదని ఆ సంస్థ వివరణ ఇచ్చుకుంది. ''పురాతన, ఆధునిక శాస్త్రీయ జ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా వివిధ చికిత్సా మార్గాల కఠినమైన సరిహద్దులను చెరిపేయడం ద్వారా మానవాళిని పీడిస్తోన్న వ్యాధిని నయం చేద్దాం, అందరం చేతులు కలుపుదాం..'' అని పతంజలి సంస్థ చీఫ్ ఆచార్య బాలకృష్ణన్ పేర్కొన్నారు. రాందేవ్ కామెంట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు రోడ్డెక్కుతామని హెచ్చరించిన తర్వాత కూడా ఈ ఉదంతంలో కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోవడం గమనార్హం.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications