బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, జ్యుడీషియల్ కస్టడీకి మన్సూర్ ఖాన్, ఎస్ఐటీ, ఈడీ అధికారులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఖాన్ జైలుకు వెళ్లాడు. నిందితుడు మన్సూర్ ఖాన్ ను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న మన్సూర్ ఖాన్ ను జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.

ఇన్ని రోజులు ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఖాన్ ను గురువారం బెంగళూరులోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న ఈడీ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడు మన్సూర్ ను ఖాన్ ను జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

జులై 19వ తేదీ దుబై నుంచి భారత్ చేరుకున్న మన్సూర్ ఖాన్ ను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మన్సూర్ ఖాన్ ను విచారణ చేసి వివరాలు సేకరించడానికి ఈడీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

IMA scam prime accused Mohammed Mansoor Khan sent to judicial custody

ఐఎంఏ స్కాం కేసు విచారణ చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ)ని నియమించింది. ఈడీ అధికారుల అదుపులో ఉన్న మన్సూర్ ఖాన్ ను తమ అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని ఎస్ఐటీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో మనవి చేశారు.

కేసు వివరాలు తెలుసుకన్న న్యాయస్థానం నిందితుడు మన్సూర్ ఖాన్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో నిందితుడు మన్సూర్ ఖాన్ ను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరించారు.

English summary
IMA scam prime accused Mohammed Mansoor Khan sent to judicial custody for 14 days. He is in Enforcement Directorate custody from July 19, 2019.IMA scam prime accused Mohammed Mansoor Khan sent to judicial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X