కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి: షరీఫ్‌కు జమామసీద్ ఇమామ్ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీ జమా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పాక్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కాశ్మీర్‌లోయలో నెలకొన్న అశాంతి పరిష్కారం, కాల్పుల విరమణ , వేర్పాటువాద నాయకులు, తీవ్రవాద యువతతో చర్చలకు తనను ఉపయోగించుకోవాలని నవాజ్‌షరీఫ్‌ను కోరారు.

భారత్, పాక్‌లతో పాటు వేర్పాటు నాయకులు, తీవ్రవాద యువత, రెండు దేశాల ప్రభుత్వాలకు మధ్యవర్తిగా ఉంటానని ఆయన ప్రకటించారు. తెలివితేటలతో అక్కడ ఉన్న అశాంతి, హింసలను తొలగించి శాంతిస్థాపనకు కృషిచేయాలని ఆయన కోరారు.

Imam Bukhari Writes to Pak PM Nawaz Sharif, Asks Him to Initiate Talks in Kashmir

కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరస్పర చర్చల ద్వారా కాల్పుల విరమణను ప్రకటించాలని తద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతోందన్నారు బుఖారీ.

ఈ ఏడాది జూన్ 22న, ఈ ఉత్తరం రాశాడు. కాశ్మీర్‌లో కన్నీరు ప్రవహిస్తోందన్నారు. ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. దీంతో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్నారు. చర్చలు ఆలస్యమయ్యేకొద్దీ సమస్యలు పెరిగే అవకాశం ఉందన్నారు.

రెండు దేశాల మద్య చర్చల ద్వారా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను తగ్గించే అవకాశం ఉందన్నారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని రెండు దేశాల మధ్య తాను ఏర్పాటుచేస్తానని ఆయన తన లేఖలో చెప్పారు. కాల్పుల విరమణకోసం తీవ్రవాద యువత హురియత్ నాయకులను ఒప్పించాలని ఆయన పాక్ ప్రధానిని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
he Shahi Imam of Delhi’s Jama Masjid, Syed Ahmed Bukhari, has written a letter to Pakistan Prime Minister Nawaz Sharif, urging him to use his influence on separatist leaders and militant youth to make them agree to a ceasefire to resolve the unrest in the Kashmir valley.
Please Wait while comments are loading...