తుఫానుతో పెను విధ్వంసం - లక్ష మంది తరలింపు, రైళ్లు రద్దు..!!
బిపోర్‌జాయ్ బీభత్సం సృష్టించింది. బిపోర్‌జాయ్ రాత్రి 9:30 గంటలకు జఖౌ పోర్టు వద్ద తీరం దాటింది. తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. గుజరాత్ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది. ద్వారకా, సోమనాథ్ ఆలయాలను గురువారం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎనిమిది జిల్లాలపై ప్రభావం:
బిపర్‌జోయ్ ప్రభావంతో తీర ప్రాంతానికి చెందిన ఎనిమిది జిల్లాలు కచ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్బందర్, దేవభూమి ద్వారక, జునార్‌గఢ్, మోర్బీ అతలాకుతలమయ్యాయి. ద్వారకలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. గాలి తీవ్రతతో చెట్లు, కరెంట్ స్తంభాలు కుప్పకూలాయి. కచ్ ప్రాంతంలో కరెంట్ పూర్తిగా నిలిపివేశారు.
గుజరాత్ తీర ప్రాంతాలపై బిపర్‌జోయ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. తీర ప్రాంతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గుజరాత్‌లోని ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, మోర్బి, రాజ్‌కోట్, జునాగఢ్, ఆమ్రేలి, భావ్‌నగర్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 18 ఎన్డీఆర్‌ఎఫ్, 12ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు రోడ్లు భవనాలశాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్‌శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ద్వారకా..సోమనాధ్ ఆలయాల మూసివేత:ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పశ్చిమ రైల్వే 76 రైళ్లను రద్దు చేసింది. ద్వారకా, సోమనాథ్ ఆలయాలను గురువారం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేవభూమి ద్వారక నుంచి 10,749 మంది, జామ్‌నగర్ నుంచి 9,942 మంది, మోర్బీ నుంచి 9,243 మంది, రాజ్‌కోట్ నుంచి 4,864 మంది, జునార్‌గఢ్ నుంచి 4,379 మందిని ఖాళీ చేయించారు.
సురక్షిత ప్రాంతాలకు తరించిన వారిలో 8,900 మంది పిల్లలు, 1,131 మంది గర్భిణులు, 4,697 మంది వృద్ధులు ఉన్నారు. బాధితుల సహాయార్థం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రత కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడి, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయనే అంచనాతో ప్రభావిత జిల్లాల్లో జనరేటర్ సెట్లను ఏర్పాటు చేయించారు. సహాయక చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
విమానాలు..రైళ్ల పై ప్రభావం:గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ వివిధ శాఖల ఉన్నతాధికారులతో తుపాను పరిస్థితి మీద సమీక్ష నిర్వహించారు. కాగా గుజరాత్‌తో పాటు రాజస్థాన్‌పైనా తుపాను ప్రభావం ఉంటుందని ఐఎం డీ డీజీ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్రో పేర్కొన్నా రు.
తుపాను తీరం దాటక మునుపు గాలుల తీవ్రత గంటకు 150 కి.మీ దాకా ఉండటంతో నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందుగా సహాయక చర్యలను ముమ్మరం చేసారు. రాజస్థాన్ పైనా బిజర్జాయ్ ప్రభావం పడుతోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం ఎప్పటికిప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. తుఫాను బలహీనపడి ఈ సాయంత్రానికి రాజస్థాన్ మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications