20, 21 తేదీల్లో చల్లటి శుభవార్తను వినిపించిన వాతావరణశాఖ

తమిళనాడులోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో 20, 21 తేదీల్లో మోస్తరు వర్షాలు కురియనున్నాయి. ఈ విషయాన్ని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడివాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరుగుతాయని అంచనా వేశారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో రానున్న 48 గంటల్లో 34 నుంచి 35 డిగ్రీల చొప్పున, రాత్రివేళ 25 నుంచి 26 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. శనివారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీశాయి. కొన్ని పంటలకు నష్టం వాటిల్లాయి. అలాగే ఏపీలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. లంబసింగి, అరకు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో తెల్లవారుజామున మాత్రం చల్లటి వాతావరణం నెలకొంటోంది. రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ప్రకటించారు.

imd predicts rainfall in tamil nadu state

ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. పశ్చిమ హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్ వంటి కొండ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురవడంవల్ల హిమపాతం నమోదు కానుంది. దీనివల్లే పగటివేళ ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.

కొద్దిరోజుల క్రితమే హిమాచల్ ప్రదేశ్‌‌లో భారీ వర్షం, హిమపాతం వల్ల ఐదు జాతీయ రహదారులను మూసేశారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వంతెనలు కూలిపోవడంతో కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. కొండ ప్రాంతాల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. దీనివల్ల దేశ రాజధానిలో రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో వాయు నాణ్యత 140కి దగ్గరగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+