వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ మాటకు భిన్నంగా గీత లెక్క -భారత్ వృద్ధిరేటు అంచ‌నాను భారీగా తగ్గించిన ఐఎంఎఫ్

|
Google Oneindia TeluguNews

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి విలయం నుంచి భారత్ వేగంగా కోలుకుంటున్నదని, దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోందని, రాబోయే రోజుల్లో చక్కటి వృద్ది రేటు నమోదవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇవ్వగా, అందుకు తగినట్లే కేంద్ర ఆర్థిక శాఖ ఈఏడాది భారత్ వృద్ధి రేటును భారీగా అంచనా వేసింది. కానీ వాస్తవానికి..

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

మోదీ సర్కారు చెప్పినంత స్థాయిలో భారత్ లో ఆర్థిక వృద్ధి అసాధ్యమని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ విలయం ప్రభావం తీవ్రంగా ఉందని ఐఎంఫ్ చెప్పింది. తద్వారా..

IMF cuts Indias growth forecast to 9.5% from 12.5% for FY 2021-22 amid covid crisis

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ అంచనా వృద్ధి రేటును 300 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఐఎంఎఫ్. ఏప్రిల్‌లో నిర్వహించిన సమీక్షలో భారత్ 12.5 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసిన ఐఎంఎఫ్.. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తాజాగా నిర్వహించిన సమీక్షలో భారత్ వృద్ది రేటును 9.5 శాతానికి తగ్గించింది.

భార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగభార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగ

ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఈ ఏడాది మార్చి-మే మధ్య కాలంలో కోవిడ్ మహమ్మారి ప్రభావం పడిందని ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మార్చి-మే మధ్య కాలంలో కోవిడ్-19 మహమ్మారి రెండో దశ విలయం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత దేశంలో వృద్ధి అవకాశాలపై అంచనాలను తగ్గించినట్లు తెలిపింది. ఈ ఎదురు దెబ్బ నుంచి చాలా నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపింది. అంతేకాదు..

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ అంచనా వృద్ధి రేటును భారీగా తగ్గించిన ఐఎంఎఫ్.. రాబోయే రోజుల్లోనైనా పరిస్థితి ఆశజనకంగా మారొచ్చనే హింట్ ఇవ్వలేదు సరికదా, భారత్ లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆశించిన దానికంటే మంద‌కొడిగా సాగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వృద్ది రేటు అంచనా తగ్గింపు ప్రభావం రుణాలు, పెట్టుబడులపై ఉండే అవకాశముంది. ఐఎంఎఫ్ ప్రకటనపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

English summary
The International Monetary Fund (IMF) on Tuesday slashed India’s economic growth forecast to 9.5% from earlier 12.5% for the fiscal year 2021-22. IMF’s chief economist Gita Gopinath said the revision in growth forecast reflects an important “extent differences” in coronavirus disease (Covid-19) developments as the highly contagious Delta variant is becoming dominant across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X