రాందేవ్‌బాబాకు సుప్రీం షాక్.. నేరుగా హాజరుకావాలని నోటీసులు!
పతంజలి యాడ్స్ కేసు విషయంలో రాందేవ్ బాబాకు మరోసారి షాక్ తగిలింది. రామ్ దేవ్ బాబాతోపాటు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై స్పందన రాకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు వీరిద్దరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. పతంజలి తమ ఉత్పత్తులపై ప్రచురించే యాడ్స్ పై కోర్టులో ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు గత నెలలో సుప్రీం కోర్టు పతంజలిని ప్రశ్నించింది. అదే సందర్భంలో పతంజలితోపాటు మేనేజింగ్ డైరక్టర్ బాలకృష్ణలపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ వారికి గతంలోనే నోటీసులు జారీ చేసింది. అయితే, కోర్టు నోటీసులపై పతంజలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

తప్పుదోవ పట్టించే ప్రకటనల కిందకు : తాజాగా పతంజలి యాడ్స్ పై ఈరోజు (మార్చి 19న) సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. పతంజలి పబ్లిసిటీ, యాడ్స్ విషయంపై కీలక ఆదేశాలను జారీ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతోపాటు పతంజలి ఉత్పత్తుల్లోని ఔషధాలకు సంబంధించి స్వయంగా కోర్టుకు హాజరై, సమాధానం చెప్పాలంటూ సంస్థ నిర్వాహకులు బాలకృష్ణన్‌తోపాటు రాందేవ్ బాబాకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ధర్మాసనం ఇచ్చిన నోటీసుపై వివరణ ఇవ్వడంలో విఫలమైనందుకుగానూ పతంజలి ఆయుర్వేదం, యోగా గురువు రామ్‌దేవ్‌లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించినట్లు స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్‌లోని సెక్షన్ 3 మరియు 4ను ఉల్లంఘించడంలో రామ్‌దేవ్ మరియు బాలకృష్ణ ఇద్దరూ ప్రాథమికంగా ఉల్లంఘించారని, ఇది మెడిసిన్‌ల తప్పుదోవ పట్టించే ప్రకటనల కిందకు వస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణకు నేరుగా హాజరుకావాలని సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications