సిమి ఉగ్రవాదం: సీఎంలకు రాజ్‌నాథ్ సింగ్ లేఖలు
న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాలు అడ్డుకొవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అందు కొసం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి పన్వీరు సెల్వం, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్‌లకు ఆయన వేర్వేరుగా లేఖలు వ్రాశారు. ఉగ్రవాదులను అడ్డుకోవడానికి కేంద్రం ఎల్లవేళలా తగిన సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
సిమి ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే అందుకు అవవసరమైన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఉగ్రవాదులు దాడులు చేశారని గుర్తు చేస్తూ కేసుల దర్యాప్తులు ఎంత వరకు వచ్చాయని వివరణ అడిగారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరకుండా జాగ్రతలు తీసుకొవాలని సూచించారు.
2014 డిసెంబర్ 28వ తేదిన బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ లో బాంబు పేలుడు జరిగిందని, కర్ణాటక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని అంటూ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని వివరాలు తెలపాలని సూచించారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా మద్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా లేఖ రాశారు. 2013 అక్టోబర్ 1వ తేదిన కాంద్వా జైలు నుండి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులను ఇంత వరకు ఎందుకు అరెస్టు చెయ్యలేదని ప్రశ్నించారు. సిమి ఉగ్రవాదులు దేశంలోని అనేక నగరాలలో బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు స్కెచ్ లు వేస్తున్నారని అంటూ జాగ్రతగా ఉండాలని హెచ్చరించారు.
జైలు నుండి తప్పించుకున్న ఐదుగురు సిమి ఉగ్రవాదులు మహమ్మద్ అజాదుద్దిన్, మహమ్మద్ అస్లాం, అజ్మాద్ ఖాన్, జాకీర్ హుస్సేన్ సిధ్దిఖి, మహబూబ్ గుడ్డూలను వెంటనే అరెస్టు చెయ్యడానికి తగిన చర్యలు తీసుకొవాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సూచించారు.
2014 మే 1వ తేదిన చెన్నయ్ రైల్వే స్టేషన్ ఉగ్రవాదులు దాడులు చేశారని ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ నివేదిక పంపించాలని పన్నీర్ సెల్వంకు సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications