
ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది.. డ్రైవర్‍ను సిగరేట్ అడిగింది.. కట్ చేస్తే..ప్రియురాలి ముందే అత్యాచారం..
యువతిపై ర్యాపిడో బైక్ డ్రైవర్ తో పాటు అతని స్నేహితుడు అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. నవంబర్ 25న కేరళకు చెందిన బాధిత యువతి.. తన స్నేహితుడి వద్దకు వెళ్లాలని ర్యాపిడో బైక్ బుక్ చేసింది. ఆమె అప్పటికే మద్యం తాగింది. ఈ మత్తులోనే ఆమె బైక్ బుక్ చేసుకుంది. కొద్ది సేపటికే ర్యాపిడో బైక్ వచ్చింది. ఆమె ఓటీపీ చెప్పగానే బైక్ డ్రైవర్ షహబుద్దీన్ మ్యాప్ సాయంతో ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనకాల కూర్చున్న ఆమె తాగిన మత్తులో ఏదో ఏదో మాట్లాడుతుంది. ఆమె తాగినట్లు షహబుద్దీన్ అర్థమైపోయింది.
ఈ క్రమంలో సదరు యువతి షహబుద్దీన్ ను సిగరేట్ ఉందా అని అడిగింది. తన వద్ద సిగరేట్ లేదని అతడు చెప్పాడు. ఆమె తనకు సిగరేట్ కావాలని చెప్పడంతో అతను బైక్ ను పక్క నిలిపి షాపులో సిగరేట్ కొనుగోలు చేశాడు. అతని వద్ద డబ్బు లేకపోవడంతో యూపీఐ పేమెంట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ యూపీఐ యాప్ పని చేయలేదు. దీంతో షహబుద్దీన్ తన స్నేహితుడు. అర్పత్ షరీఫ్‌కు కాల్ చేసి డబ్బు తీసుకురమ్మని కోరాడు. డబ్బు ఎందుకు అని అతడు అడగడంతో ఒక డ్రాపింగ్ వచ్చింది. ఓ యువతిని డ్రాప్ చేయడానికి వెళ్తున్న.. ఆమె సిగరేట్ అడగడంతో సిగరేట్ కొనుగోలు చేశా.. కానీ తన ఫోన్ పని చేయడం లేదని వివరించాడు. అమ్మాయి తాగిన మత్తులో ఉందని చెప్పాడు.

అర్పత్ షరీఫ్ మదిలో ఓ చెడు ఆలోచన మొదలైంది. అమ్మాయి మద్యం మత్తులో ఉంది కదా.. ఆమెను తీసుకెళ్లి అనుభవిస్తే ఎలా ఉంటుందని అన్నాడు. దీనికి షహబుద్దీన్ ఓకే చెప్పాడు. దీంతో యువతిపై అత్యాచారం చేయాలని ఇద్దరూ మాట్లాడుకుని షహబుద్దీన్ యువతిని తన రూమ్‌కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే షహబుద్దీన్ ప్రియురాలు రూంలో ఉంది. ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడి చేశారు. ఆమెను అత్యాచారం చేయడాన్ని షహబుద్దీన్ ప్రియురాలు అక్కడే ఉండి చూసింది.
మద్యం మత్తులో ఉన్న ఆ యువతి తనపై అత్యాచారం జరుగుతుందని కూడా గుర్తించలేకపోయింది. ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం షహబుద్దీన్ ఆమెను డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం యువతికి శరీరంలో నొప్పులు రావడంతో అత్యాచారం జరిగినట్లు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే స్నహేతుడికి చెప్పింది. ఆతను వచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమెన్ వైద్యులు పరీక్షించి అత్యాచారం జరిగినట్లు గుర్తంచారు. దీంతి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చశారు.
పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు నిందితులందరినీ అరెస్టు చేశారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల సహాయంతో సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. "ఆ మహిళ స్నేహితుడి ఇంటి ళ్లడానికి 'రాపిడో' బైక్‌ను అద్దెకు తీసుకుంది. మార్గమధ్యంలో, బైక్ డ్రైవర్ ఆమెను తన రూం కు తీసుకెళ్లాడు. అక్కడ అతను తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు"అని బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనలో అమ్మాయి తాగి ర్యాపిడో బుక్ చేసుకోవడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. తాగి ఒళ్లు తెలియకుండా రోడ్డుపైకి వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.