ఈడీకి తమిళనాడు సర్కార్ షాక్- 40 లక్షల లంచం కేసులో అధికారి అరెస్ట్..!

ఇప్పటివరకూ కేంద్రం తనకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలను ఈడీ ద్వారా టార్గెట్ చేస్తుండగా.. ఇప్పుడు వారు తిరిగి ఈడీని టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఓ ఈడీ అధికారిని దోపిడీ కేసులో అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడులో అరెస్టయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి దోపిడీ రాకెట్‌లో పాల్గొన్నట్లు పోలీసుల ఫిర్యాదులో వెల్లడైంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారిని తమిళనాడు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. తమిళనాడు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దోపిడీ రాకెట్‌లో పట్టుబడిన అధికారి అంకిత్ తివారీ పాత్ర గురించి స్పష్టంగా ఉంది. హార్దిక్ అనే నకిలీ పేరుతో తివారీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపేవారని తేలింది. ఈ కాల్స్‌ ద్వారా అతను లంచం డిమాండ్ చేసేవాడని ఫిర్యాదుదారు డాక్టర్ సురేష్ బాబు ఇలా తాను రూ.40 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

in big shock to enforcement directorate, tamil nadu government arrest ed official in extortion case

ప్రయాణ సమయంలో అక్రమ లావాదేవీలు తరచూ హైవేపై జరుగుతాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మదురైకి వెళుతున్నప్పుడు డాక్టర్ సంతోష్‌ను కలిశాడని తేలింది. ఈ ప్రయాణంలో చర్చలు జరిగాయని, నవంబర్‌లో మొదటి విడత రూ.20 లక్షల లంచం నగదును తీసుకున్నాడని, మిగిలిన డబ్బును తన బూటులో వేయమని చెప్పారని పోలీసులు తెలిపారు.తమిళనాడు విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ లంచం డబ్బును రికవరీ చేయడానికి తివారీ కారును వెంబడించారు.

డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ప్రకారం ఓ కేసులో చట్టపరమైన చర్యల్ని ఆపడానికి 3 కోట్ల లంచం డిమాండ్ చేశారు. దీని కోసం అక్టోబర్ 29 న సదరు డాక్టరును సంప్రదించారు. అలాగే ప్రధాని కార్యాలయం నుంచి వస్తున్న సూచనల మేరకు పనిచేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ను మధురై ఈడీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడ ఈ లంచం డిమాండ్ చేశారు.ఆ తర్వాత ఇది రూ.51 లక్షలకు తగ్గింది. ఇందులో 40 లక్షలు తీసుకుంటూ దొరికిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+