Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి వృద్దురాలికి చికిత్స చేసిన మంత్రి, ప్రజాసేవ ముఖ్యం, అధికారం !

చెన్నై: తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు, శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీలతో పాటు ఎన్నికల బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి జయకుమార్ ప్రమాదానికి గురైన మహిళకు చికిత్స చేసి ఓటర్లను ఆకర్షించారు.

చెన్నైలో మంత్రి జయకుమార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మంత్రి జయకుమార్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రాంతంలోనే ఓ వృద్దురాలు రోడ్డు ప్రమాదానికి గురైయ్యింది. విషయం తెలుసుకున్న మంత్రి జయకుమార్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టారు.

In Chennai Campaign Minister (Tamil Nadu) Jayakumar made the First aid to the Old Woman in the accident.

వెంటనే ప్రమాదానికి గురైన వృద్దురాలి దగ్గరకు వెళ్లి ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. తరువాత అంబులెన్స్ కు ఫోన్ చేసిన మంత్రి జయకుమార్ వృద్దురాలిని ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారం కంటే ప్రజాసేవే ముఖ్యమని మంత్రి జయకుమార్ నిరూపించారని అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

వృద్దురాలికి ప్రథమ చికిత్స చేసిన మంత్రి జయకుమార్ ఓటర్లను ఆకర్షించారు. మంత్రి జయకుమార్ వృద్దురాలికి ప్రథమ చికిత్స చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిత్యం ప్రతిపక్షాల మీద విరుచుకుపడి వార్తల్లో ఉండే మంత్రి జయకుమార్ ఇప్పుడు ఈ విదంగా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+