రెండు పులులు బైకర్ చుట్టూ ప్రదక్షిణ చేశాయి, ఎక్కడంటే?
మహరాష్ట్ర: రెండు పులులు ఓ బైక్‌పై ఉన్న ఇద్దరి చుట్టూ ప్రదక్షిణ చేశాయి. వారిని ఏమి అనకుండా నాలుగు నిమిషాల పాటు వారిని ఎగాదిగా చూశాయి. అక్కడే తచ్చాడాయి. రెండు పులులు పక్కకు వెళ్ళగానే నలుగురు వ్యక్తులు వారిని కారులో తీసుకొని వెళ్ళిపోయారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది. రెండు పులులు అత్యంత సమీపంలోకి వచ్చినా కానీ వారు ప్రాణాలతో బయటపడ్డారు.
కారులో కానీ, ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో పులి దగ్గరికి వస్తేనే భయపడుతాం, కానీ, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రం రెండు పులుల నుండి సురక్షితంగా బయటపడ్డారు. వారి అదృష్టం వారిని కాపాడిందనే చెప్పొచ్చు.

మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ చోట ఆగి ఉండగా అనూహ్యంగా రెండు పెద్ద పులులు వారి దగ్గరకు వచ్చాయి. వాటిని చూడగానే భయంతో వారు బిగుసుకుపోయారు.వీరికి సమీపంలోనే కారులో కొందరు అదే దారి గుండా ప్రయాణం చేస్తున్నారు.
బైక్ వద్దకు రెండు పులులు వచ్చిన విషయాన్ని గమనించిన కారులోని వారు వారికి జాగ్రత్తలు చెప్పారు. కదలకుండా అక్కడే ఉండాలని సూచించారు. ఆ రెండు పులులు బైక్ చుట్టూ తిరిగాయి.
కానీ బైక్ పై ఉన్న వారిని ఏమనలేదు. అంతేకాదు నాలుగైదు నిమిషాలు పులులు అక్కడే తచ్చాడాయి. కొద్ది సేపటి తర్వాత పులులు దూరంగా వెళ్ళిపోగానే కారులో ప్రయాణిస్తున్నవారంతా బైక్‌పై ఉన్న వారిని తమ కారులో తీసుకొని వెళ్ళిపోయారు.












Click it and Unblock the Notifications