RTC బస్సుల్లో 100 కోట్ల ప్రయాణాల మార్క్..ఫ్రీ జర్నీతో మహిళలు దుమ్ము లేపారు..!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఐదు ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేసిన శక్తి పథకంలో భాగంగా కర్ణాటకలోని మహిళలకు ఉచితంగా ఆర్ టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టి ఐదు నెలలు పూర్తయింది.

జూన్ 11వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు కోట్లాది మంది మహిళలు ఉచితంగా కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కర్ణాటకకు చెందిన నాలుగు కార్పొరేషన్ల బస్సుల్లో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మహిళలు శక్తి పథకం ద్వారా లబ్ధి పొందారని, శక్తి పథకం అమలులోకి వచ్చిన ఐదు నెలల్లో రూ.2, 397 కోట్లు సిద్దరామయ్య ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఉచిత బస్సు పథకం కింద 100 కోట్లకు పైగా ప్రయాణాల మార్కును విజయవంతంగా నడిపింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం

 In five months, 100 crore women passengers traveled in Karnataka KSR C buses for free

మరికొద్ది రోజుల్లోనే మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి సిద్దరామయ్య ప్రభుత్వానికి రూ 2, 500 కోట్ల రూపాయలకు ఖర్చు అవుతోందని తెలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూన్ 11వ తేదీన మొదటి హామీ పథకంగా శక్తి పథకం అమలు చేశారు. విధానసౌధ ఎదుట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు.

 In five months, 100 crore women passengers traveled in Karnataka KSR C buses for free

శక్తి గ్యారంటీ పథకాన్ని కర్ణాటక సీఎం సిద్దారమయ్య జూన్ 11 న ప్రారంభించగా, 160 రోజుల్లోనే 100,47,56,184 ప్రయాణాలు దాటడం విశేషం. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల మొత్తం టికెట్ విలువ రూ. 2, 397 కోట్లకు చేరుకుంది.

పథకం ప్రారంభించిన మొదటి నెల అంటే జూన్‌లో అత్యధిక సంఖ్యలో మహిళా ప్రయాణికులు 10,54,45,047 మంది ఉన్నారు. జూలైలో ఈ సంఖ్య 19,63,00,625 వద్ద స్వల్పంగా తగ్గి ఆగస్టులో మళ్లీ పెరిగి 20,03,60,680కి చేరుకుంది. సెప్టెంబర్‌లో 18,95,49,754 మంది ప్రయాణికులు పథకం ప్రయోజనాలను పొందారు. గత నెలలో రాష్ట్రంలో 18,26,17,460 మంది లబ్ధిదారులు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+