దారుణం: పశువులను దొంగిలించారని ఇద్దర్ని కొట్టి చంపారు
రాంచీ: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ పశువులను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలను గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
గొడ్డా జిల్లాలోని దుల్లు గ్రామంలో బుధవారం రాత్రి మున్షి ముర్ము ఇంటి నుంచి ఐదుగురు వ్యక్తులు బర్రెలను దొంగిలించారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేశారని డీఐజీ అఖిలేష్ కుమార్ ఝా చెప్పారు.

తమ బర్రెలు కనిపించకపోవడంతో ముర్ముతో పాటు ఇతర గ్రామస్థులు ఐదుగురు వ్యక్తుల కోసం గాలించగా గురువారం తెల్లవారుజామున సమీప బంటకి గ్రామంలో వారిని గుర్తించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు సిరాబుద్దీన్ అన్సారి (35), ముర్తజా అన్సారీ(30)లను తీవ్రంగా కొట్టడంతో వారు ప్రాణాలు వదిలారు.
మిగిలిన ముగ్గురు తప్పించుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి ముర్ముతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా, బాధితులు ఇదే జిల్లాకు చెందిన తలిజారి గ్రామస్తులని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications